Ashes 2023 : బ‌జ్‌బాల్ దెబ్బ‌.. ఆసీస్ అబ్బా.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. సిరీస్ ఆశ‌లు స‌జీవం

ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ (Ashes )సిరీస్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచులు ఓడిన ఇంగ్లాండ్(England) జ‌ట్టు నిర్ణ‌యాత్మ‌క‌మైన మూడో మ్యాచులో విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియా(Australia) ఆధిక్యాన్ని 2-1కి త‌గ్గించింది.

Ashes 2023 : బ‌జ్‌బాల్ దెబ్బ‌.. ఆసీస్ అబ్బా.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ విజ‌యం.. సిరీస్ ఆశ‌లు స‌జీవం

Harry Brook

Ashes 2023 ENG vs AUS : ప్ర‌తిష్టాత్మ‌క యాషెస్ (Ashes )సిరీస్‌లో వ‌రుస‌గా రెండు మ్యాచులు ఓడిన ఇంగ్లాండ్(England) జ‌ట్టు నిర్ణ‌యాత్మ‌క‌మైన మూడో మ్యాచులో విజ‌యం సాధించింది. ఆస్ట్రేలియా(Australia) ఆధిక్యాన్ని 2-1కి త‌గ్గించింది. మ‌రో రెండు టెస్టు మ్యాచులు మిగిలిన ఉన్న నేప‌థ్యంలో సిరీస్ గెలిచేందుకు ఇరు జ‌ట్ల‌కు అవ‌కాశాలు ఉన్నాయి. 251 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ జ‌ట్టు మూడు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

ఇంగ్లాండ్ బ్యాట‌ర్ల‌లో హ్యారీ బ్రూక్ (75; 93 బంతుల్లో 9 ఫోర్లు), జాక్ క్రాలీ(44; 55 బంతుల్లో 5 ఫోర్లు) క్రిస్ వోక్స్‌(32 నాటౌట్; 47 బంతుల్లో 4 ఫోర్లు)లు రాణించారు. ఆసీస్ బౌల‌ర్ల‌లో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీసినా జ‌ట్టును గెలిపించుకోలేక‌పోయాడు. మిగిలిన వారిలో ప్యాట్ క‌మిన్స్, మిచెల్ మార్ష్ చెరో వికెట్ ప‌డ‌గొట్టాడు.

Ashes 2023 : టెస్టుల్లో 10వ సారి జో రూట్ ను ఔట్ చేసిన క‌మిన్స్‌.. ఆసీస్‌కు స్వ‌ల్ప ఆధిక్యం

ఓవ‌ర్ నైట్ స్కోరు 27/0 తో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జ‌ట్టు గ‌త కొంత కాలంగా అనుస‌రిస్తున్న బ‌జ్‌బాల్ వ్యూహ్యాన్నే అనుస‌రించింది. ఆట ఆరంభ‌మైన కాసేటికి మిచెల్ స్టార్క్ ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చాడు. 23 ప‌రుగులు చేసిన ఓపెన‌ర్ బెన్ డ‌కెట్‌ను ఎల్భీగా ఔట్ చేశాడు. దీంతో 47 ప‌రుగుల వ‌ద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్‌ను కోల్పోయింది.

WI vs IND : వెస్టిండీస్‌పై టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన భార‌త బ్యాట‌ర్లు ఎవ‌రో తెలుసా..?

ఓ వైపు స్టార్క్ విజృంభించ‌గా మోయిన్ అలీ(5), రూట్‌(21), బెన్ స్టోక్స్‌(13), జానీ బెయిర్ స్టో(5) లు విఫ‌లం కావ‌డంతో ఇంగ్లాండ్ జ‌ట్టు 171 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన‌ట్లు క‌నిపించింది. అయితే ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన ఆట‌గాడు హ్యారీ బ్రూక్ అర్థ‌శ‌త‌కంతో జ‌ట్టును ఆదుకున్నాడు. జ‌ట్టు స్కోరు 230 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ రూపంలో అత‌డు వెనుదిరిగాడు. ఈ స‌మ‌యంలో ఆసీస్ ఏదైన అద్భుతం చేస్తుందేమోన‌ని అనిపించ‌గా ఆ జ‌ట్టుకు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌కుండా క్రిస్ వోక్స్‌, మార్క్ వుడ్‌(16 నాటౌట్; 8 బంతుల్లో 1 ఫోర్‌, 1 సిక్స్‌) జ‌ట్టును విజ‌య‌తీరాల‌కు చేర్చారు.

ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 263 చేయ‌గా, ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 237 ప‌రుగుల‌కు ఆలౌటైంది. దీంతో ఆసీస్‌కు 26 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో 224 ప‌రుగుల‌కు ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం క‌లుపుకుని ఇంగ్లాండ్ ముందు 251 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిలిపింది.