India vs England 2nd ODI: చేతులెత్తేసిన బ్యాట్స్‌మెన్.. రెండో వన్డేలో టీమిండియా ఓటమి
టీమిండియా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 247పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు. ఫలితంగా 100 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూశారు. గురువారం లార్డ్స్ లో ఇంగ్లాండ్ - భారత్ మధ్య రెండో వన్డే జరిగింది.

India Vs England (1)
India vs England 2nd ODI: టీమిండియా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ నిర్ధేశించిన 247పరుగుల లక్ష్య ఛేదనలో విఫలమయ్యారు. ఫలితంగా 100 పరుగుల భారీ తేడాతో ఘోర ఓటమిని చవిచూశారు. గురువారం లార్డ్స్ లో ఇంగ్లాండ్ – భారత్ మధ్య రెండో వన్డే జరిగింది. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ తీసుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ ప్రారంభంలో తడబడటంతో 102 పరుగులకే అయిదు వికెట్లు కోల్పోయ్యారు. మెయిన్ అలీ, విల్లే పోరాడటంతో గౌరవప్రమైన స్కోరును సాధించగలిగారు.
India vs England 2nd ODI: మరికొద్దిసేపట్లో లార్డ్స్‌లో రెండో వన్డే.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా
ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌ను ఆరంభించిన రాయ్, బెయిర్‌స్టో తొలుత ఆచితూచి ఆడారు. దీంతో తొలి నాలుగు ఓవర్లలో 17 పరుగులే చేశారు. ఐదో ఓవర్లో రాయ్ బౌండరీ, సిక్సర్ కొట్టడంతో 13 పరుగులు వచ్చాయి. తర్వాత కూడా ఇద్దరు ఆచితూచి ఆడటంతో పరుగుల వేగం మందగించింది. 9వ ఓవర్ వేసిన పాండ్యా తన తొలి ఓవర్లోనే జేసన్ రాయ్ (33 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్)ని అవుట్ చేశాడు. అనంతరం స్పిన్నర్ చహల్ బౌలింగ్‌కు దిగడంతో ఇంగ్లండ్ కష్టాలు పెరిగాయి. ధాటిగా ఆడగలిగే బెయిర్‌స్టో (38 బంతుల్లో 38; 6 ఫోర్లు)తో పాటు జో రూట్ (11)ను తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. బట్లర్(4)ను షమీ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ 87 పరుగులకే కీలకమైన 4 వికెట్లను కోల్పోయింది. చహల్ వేసిన 20వ ఓవర్లో రెండు బౌండరీలు బాదిన స్టోక్స్ ఆ స్పిన్నర్ మరుసటి ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. డెవిడ్ విల్లే, మెయిన్ అలీలు స్కోరు పెంచే బాధ్యతలు తీసుకున్నారు. వీరు ఏడో వికెట్ కు 62 పరుగులు జోడించారు. 49ఓవర్లకే ఆలౌట్ అయిన ఇంగ్లాండ్ 246 పరుగులు చేసింది.
Virat Kohli: కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. విండీస్ సిరీస్‌కు నో సెలెక్ట్!
247 పరుగుల లక్ష్య సాధనకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ డకౌట్ కాగా, శిఖర్ ధావన్(9) పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. ఆ వెంటనే రిషభ్ పంత్ సైతం డకౌట్ అయ్యాడు. కోహ్లీసైతం కేవలం 16 పరుగులు మాత్రమేచేసి పెవిలియన్ బాట పట్టాడు. సూర్య కుమార్ (29 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), హార్ధిక్ పాండ్యా(44 బంతుల్లో 29; 2 ఫోర్లు) కొద్దిసేపు స్కోర్ బోర్డును పెంచే బాధ్యత తీసుకున్నారు. కొద్దిసేపటికే ఇద్దరు అవుట్ కావటంతో జడేజా (29; 44 బంతుల్లో 1×4, 1×6), షమి (23; 28 బంతుల్లో 2×4, 1×6) కొద్దిసేపు ఇంగ్లాండ్ బౌలర్లను ప్రతిఘటించారు. కానీ అది ఏమాత్రం సరిపోలేదు. భారత్ ఆరు పరుగుల వ్యవధిలో చివరి నాలుగు వికెట్లు చేజార్చుకుంది. ఫలితంగా 146 పరుగులకే ఆలౌటైంది. ఇంగ్లాండ్ 100 పరుగుల భారీతేడాతో విజయం సాధించడంతో మూడు వన్డేల సిరీస్ 1-1తో సమానంగా మారింది. సిరీస్ విజేతను తేల్చే మూడో వన్డే ఈనెల 17న(ఆదివారం) మాంచెస్టర్‌లో జరుగుతుంది.
England win the second #ENGvIND ODI. #TeamIndia will look to bounce back in the series decider on Sunday. ? ?
Scorecard ???? https://t.co/N4iVtxbNBF pic.twitter.com/9pjXrRktJH
— BCCI (@BCCI) July 14, 2022
ఇంగ్లాండ్ ఇన్నింగ్స్: జేసన్ రాయ్ (సి) సూర్యకుమార్ (బి) హార్దిక్ 23; బెయిర్‌స్టో (బి) చాహల్ 38; రూట్ ఎల్బీ (బి) చాహల్ 11; స్టోక్స్ ఎల్బీ (బి) చాహల్ 21; బట్లర్ (బి) షమి 4; లివింగ్‌స్టోన్ (సి) శ్రేయస్ (బి) హార్దిక్ 33; మొయిన్ అలీ (సి) జడేజా (బి) చాహల్ 47; విల్లీ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 41; ఒవర్టన్ నాటౌట్ 10; బ్రైడన్ కార్సే ఎల్బీ (బి) ప్రసిద్ధ్ 2; టాప్లీ (బి) బుమ్రా 3; ఎక్స్‌ట్రాలు 13 మొత్తం: (49 ఓవర్లలో ఆలౌట్) 246.
వికెట్ల పతనం: 1-41, 2-72, 3-82, 4-87, 5-102, 6-148, 7-210, 8-237, 9-240; బౌలింగ్: షమి 10-0-48-1; బుమ్రా 10-1-49-2; హార్దిక్ పాండ్య 6-0-28-2; ప్రసిద్ధ్ కృష్ణ 8-0-53-1; చాహల్ 10-0-47-4; జడేజా 5-0-17-0
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ ఎల్బీ టాప్లీ 0; ధావన్ (సి) బట్లర్ (బి) టాప్లీ 9; కోహ్లి (సి) బట్లర్ (బి) విల్లీ 16; పంత్ (సి) సాల్ట్ (బి) కార్సే 0; సూర్యకుమార్ (బి) టాప్లీ 27; హార్దిక్ (సి) లివింగ్‌స్టోన్ (బి) మొయిన్ 29; జడేజా (బి) లివింగ్‌స్టోన్ 29; షమి (సి) స్టోక్స్ (బి) టాప్లీ 23; బుమ్రా నాటౌట్ 2; చాహల్ (బి) టాప్లీ 3; ప్రసిద్ధ్ (సి) బట్లర్ (బి) టాప్లీ 0; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (38.5 ఓవర్లలో ఆలౌట్) 146.
వికెట్ల పతనం: 1-4, 2-27, 3-29, 4-31, 5-73, 6-101, 7-140, 8-140, 9-145, బౌలింగ్: టాప్లీ 9.5-2-24-6; విల్లీ 9-2-27-1; కార్సే 7-0-32-1; ఒవర్ట్న్ 7-0-22-0; మొయిన్ అలీ 4-0-30-1; లివింగ్‌స్టోన్ 2-1-4-1