India vs England 2nd ODI: మరికొద్దిసేపట్లో లార్డ్స్‌లో రెండో వన్డే.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

తొలి వన్డేలో భారీ విజయాన్ని సాధించిన టీమిండియా.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకొనేందుకు పట్టుదలతో ఉంది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో రెండో వన్డే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది.

India vs England 2nd ODI: మరికొద్దిసేపట్లో లార్డ్స్‌లో రెండో వన్డే.. సిరీస్‌పై కన్నేసిన టీమిండియా

India Vs England

India vs England 2nd ODI: తొలి వన్డేలో భారీ విజయాన్ని సాధించిన టీమిండియా.. రెండో వన్డేలోనూ అదే జోరును కొనసాగించి సిరీస్‌ను కైవసం చేసుకొనేందుకు పట్టుదలతో ఉంది. ఇంగ్లాండ్ వర్సెస్ టీమిండియా మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లార్డ్స్‌లో రెండో వన్డే మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుంది. సాయంత్రం 5.30 గంటలకు వన్డే ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్‌ను గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఆటగాళ్లు ఉవ్విళ్లూరుతున్నారు.

India vs England: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో క‌న‌ప‌డి ఆశ్చ‌ర్య‌ప‌ర్చిన ధోనీ

మరికొద్దిసేపట్లో జరిగే రెండో వన్డేకు లార్డ్స్ ఆతిథ్యమివ్వబోతుంది. ఈ గ్రౌండ్ లో వన్డే ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు అత్యధిక స్కోర్ 238 పరుగులే. ఇప్పటి వరకు భారత్ జట్టు ఈ గ్రౌండ్‌లో ఎనిమిది వన్డేలు మాత్రమే ఆడింది. ఇందులో నాలుగు మ్యాచ్ లలో టీమిండియా విజయం సాధించగా, మూడు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఒక మ్యాచ్ టైగా మారింది. లార్డ్స్ లో టాస్ గెలిస్తే కెప్టెన్లు చేధనకే మొగ్గు చూపుతుంటారు. బౌలర్లకు ఆరంభంలో ఈ పిచ్ నుంచి సహకారం లభిస్తుంది.

India vs England T20: ఆదుకున్న జడేజా.. ఇంగ్లాండ్ టార్గెట్ 171.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

భారత వన్డే ఓపెనింగ్ ద్వయం శిఖర్ ధావన్-రోహిత్ శర్మలు అరుదైన రికార్డుకు చేరువయ్యారు. ఈ ఇద్దరూ కలిసి నేడు ఇంగ్లండ్ తో జరుగనున్న మ్యాచ్ లో 43 పరుగులు చేస్తే ధావన్-రోహిత్ ల జోడీ నాటి వెస్టిండీస్ దిగ్గజాలు గోర్డాన్ గ్రీనిడ్స్-డెస్మాండ్ హేన్స్ లు నెలకొల్పిన రికార్డును బద్దలు కొడతారు. లార్డ్స్ వేదికగా జరుగబోయే రెండో వన్డేలో టీమిండియా ఓపెనర్లు మరో 43 పరుగులు చేస్తే వారి భాగస్వామ్యం 5,151 పరుగులకు చేరుతుంది. తద్వారా వాళ్లు.. గోర్డాన్ గ్రీనిడ్జ్-డెస్మాండ్ హేన్స్ లు (1979 నుంచి 1991 వరకు) నెలకొల్పిన ఓపెనింగ్ రికార్డు (102 ఇన్నింగ్స్ లలో 5,150 పరుగులు) ను అధిగమిస్తారు. ధావన్ – రోహిత్ లు ప్రస్తుతం 5,108 పరుగులతో.. 5 వేలకు పైన స్కోరు చేసిన ఓపెనింగ్ ద్వయంలో నాలుగో స్థానంలో నిలిచారు.

జట్ల అంచనా భారత్‌: రోహిత్‌శర్మ(కెప్టెన్‌), ధవన్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌, పంత్‌, హార్దిక్‌ పాండ్యా, జడేజా, షమీ, బుమ్రా, ప్రసిద్ధ్‌ క్రిష్ణ, చాహల్‌

ఇంగ్లండ్‌: బట్లర్‌(కెప్టెన్‌), రాయ్‌, బెయిర్‌స్టో, రూట్‌, స్టోక్స్‌, లివింగ్‌స్టోన్‌, అలీ, విల్లే, ఓవర్టన్‌/కర్రాన్‌, బ్రైడన్‌ కర్స్‌, టోప్లె