India vs England T20: ఆదుకున్న జడేజా.. ఇంగ్లాండ్ టార్గెట్ 171.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరుగుతున్న రెండో టీ20లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాప్ ఆర్డర్ తడబడింది. దీంతో 20 ఓవర్లలో 170/8 గౌరవపదమైన పరుగులు సాధించి ఇంగ్లాండ్ జట్టు ముందు 171 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

India vs England T20: ఆదుకున్న జడేజా.. ఇంగ్లాండ్ టార్గెట్ 171.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్

Jadeja

India vs England T20: బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టీ20లో టీమిండియా టాప్ ఆర్డర్ తడబడింది. కేవలం 85 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా చివరిలో 29బంతుల్లో 46 నాటౌట్‌తో చెలరేగడంతో భారత్ 20 ఓవర్లలో 170/8 గౌరవపదమైన పరుగులు సాధించి ఇంగ్లాండ్ జట్టు ముందు 171 పరుగుల లక్ష్యాన్ని ఉంచారు.

India vs England: ఈ ఓట‌మితో టీమిండియాకు షాక్‌: అజిత్ అగార్క‌ర్

టాస్ ఓడి బరిలోకి దిగిన టీమిండియాకు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుత ఆరంభాన్ని ఇచ్చాడు. ఈ సమయంలో ఇంగ్లాండ్ అరంగ్రేటం ఆటగాడు రిచర్డ్ గ్లీసన్ టీమిండియాకు వరుస షాకులిచ్చాడు. అతడు వేసిన తొలి ఓవర్ లోనే రోహిత్ శర్మ (31) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ (1) మరోసారి నిరాశపరిచాడు. గ్లీసన్ తన రెండో ఓవర్లో వరుస బంతుల్లో వికాట్ కోహ్లీ, రిషభ్ పంత్ (26)లను పెవిలియన్ దారి పట్టించాడు.

ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను భుజాలకెత్తుకున్న సూర్యకుమార్ యాదవ్ (15)ను జోర్డాన్ అవుట్ చేశాడు. జోర్ధాన్ వేసిన 10.3 షాట్ పిచ్ డెలివరీకి గాల్లోకి షాట్ ఆడిన సూర్య కుమార్ సామ్ కరణ్ చేతికి చిక్కగా, తర్వాత బంతికే పాండ్య (12) పాయింట్ దిశలో షాట్ ఆడి డేవిడ్ మలన్ చేతికి చిక్కాడు. తరువాత బ్యాటింగ్ కు దిగిన జడేజా, దినేష్ కార్తీక్ లు భారీగా స్కోర్ సాధించేందుకు ప్రయత్నించారు. దినేశ్ కార్తీక్ (12) రనౌటయ్యాడు. అనంతరం హర్షల్ పటేల్ (13) క్రిజ్ లోకి వచ్చిన కొద్దిసేపటికే పెవిలియన్ బాటపట్టాడు. భువనేశ్వర్ కుమార్(2) వెంటనే అవుట్ అయ్యాడు. టీమిండియా స్కోర్ 18 ఓవర్లకు 159/8వికెట్లు కోల్పోయింది. జడేజా చివరి రెండు ఓవర్లలో దాటిగా ఆడటంతో టీమిండియా 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ 19 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.