Virat Kohli: కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. విండీస్ సిరీస్‌కు నో సెలెక్ట్!

ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమిండియా బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. ముందుగా ఊహించినట్లుగానే కోహ్లీని వెస్టిండీస్ టి20 సిరీస్ కు దూరం పెట్టింది.

Virat Kohli: కోహ్లీకి షాకిచ్చిన బీసీసీఐ.. విండీస్ సిరీస్‌కు నో సెలెక్ట్!

Virat

Virat Kohli: ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న టీమిండియా బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి బీసీసీఐ షాకిచ్చింది. ముందుగా ఊహించినట్లుగానే కోహ్లీని వెస్టిండీస్ టి20 సిరీస్ కు దూరం పెట్టింది. చేతన్ శర్మ నాయకత్వంలోని సెలక్షన్ కమిటీ గురువారం వెస్టిండీస్ తో జరిగే ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. ఇందులో కోహ్లీకి చోటు దక్కలేదు. ప్రస్తుతం ఫామ్ కోల్పోయి గ్రౌండ్ లో పరుగులు రాబట్టేందుకు విరాట్ కోహ్లీ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో కోహ్లీకి విశ్రాంతి ఇవ్వటమే నయమన్న భావనకు వచ్చిన బీసీసీఐ కోహ్లీకి షాకిచ్చింది.

Virat Kohli: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీ, బుమ్రా దూరం

ఐదు మ్యాచ్ టీ20 సిరీస్ లో భాగంగా కోహ్లీతో పాటు ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాలకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. KL రాహుల్, కుల్దీప్ యాదవ్ కు చోటు కల్పించారు. సెలక్షన్ కమిటీ మొత్తం 18 మందితో టీమ్ ను ప్రకటించింది. అయితే రాహుల్, కుల్దీప్ లు ఫిట్ నెస్ పరీక్షలో నెగ్గాల్సి ఉంది. వారు విఫలం అయితే సిరీస్ లో ఆడే అవకాశం కోల్పోతారు. ఇదిలాఉంటే ఇప్పటికే వెస్టిండీస్ తో జరిగే మూడు వన్డేల కోసం టీమిండియా జట్టును ప్రకటించగా.. దానికి శిఖర్ దావన్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు.

జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కెఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఐ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, ఎస్ అయ్యర్, డి కార్తీక్, ఆర్.పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, అశ్విన్, ఆర్. బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, బి. కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్దీప్ సింగ్.

షెడ్యూల్ ఇలా..
వన్డేలు : జూలై 22న (తొలి వన్డే), జూలై 24న (రెండో వన్డే), జూలై 27న (మూడో వన్డే)
టి20లు : జూలై 29(తొలి టి20), ఆగస్టు 1 (రెండో టి20), ఆగస్టు 2(మూడో టి20), ఆగస్టు 6 (నాలుగో టి20), ఆగస్టు 7 (ఐదో టి20) మ్యాచ్ లు జరగనున్నాయి.