Premi Viswanath: వెండితెరపైకి వంటలక్క ఎంట్రీ.. ఈసారి పక్కా!

బుల్లి తెరపై మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచీ.. ఇప్పటి వరకూ ప్రేక్షకులను ఓకే విధంగా ఆకట్టుకుంటూ వస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకదశలో ఐపీఎల్ తో పోటీగా నిలిచిందంటే ఈ సీరియల్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు.

Premi Viswanath: వెండితెరపైకి వంటలక్క ఎంట్రీ.. ఈసారి పక్కా!

Premi Viswanath

Premi Viswanath: బుల్లి తెరపై మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం. ఈ సీరియల్ లో నటించిన ప్రతి ఒక్కరూ ఎంతో పాపులారిటీ సంపాదించారు. ఈ సీరియల్ మొదలైనప్పటి నుంచీ.. ఇప్పటి వరకూ ప్రేక్షకులను ఓకే విధంగా ఆకట్టుకుంటూ వస్తోంది. మన తెలుగు రాష్ట్రాలలో ఈ సీరియల్ కు వున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒకదశలో ఐపీఎల్ తో పోటీగా నిలిచిందంటే ఈ సీరియల్ క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా వంటలక్క.. డాక్టర్ బాబు క్యారెక్టర్లను ఓన్ చేసుకున్న ప్రేక్షకులు కార్తీక దీపానికి బ్రహ్మరధం పడుతున్నారు.

ఈ సీరియల్ తోనే పాపులారిటీ దక్కించుకున్న ప్రేమి విశ్వనాధ్ ఇప్పుడు బుల్లితెర నుండి వెండితెర మీదకి రానుంది. ఈమెకు ఇప్పుడు ఒక ఆఫర్ వెతుక్కుంటూ వచ్చిందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి- హీరో రామ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే షూటింగ్ కూడా మొదలుపెట్టిన ఈ సినిమా తెలుగు-తమిళ భాషల్లో ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో రామ్‌కు జోడీగా కృతిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుంది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర ఉండగా దాని కోసం కొన్నిరోజులుగా వేటలో ఉన్న మేకర్స్ మేకర్స్‌ వంటలక్కను ఫైనల్ చేసినట్లుగా తెలుస్తుంది. కథ నచ్చడంలో ఆమె కూడా వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. నిజానికి ప్రేమి విశ్వనాధ్ ఎప్పుడో సినిమాలలో నటించాల్సింది. రెండుమూడేళ్ల క్రితమే ఆమెకి ఫిల్మ్ మేకర్స్ నుండి పలు ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించింది. అయితే.. ఈసారి మంచి ప్రాజెక్ట్.. రెండు బాషలలో ఒకేసారి ఎంట్రీ.. మంచి పారితోషకం కలిసి ఆమె ఎంట్రీ మార్గం ఏర్పడినట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.