Raja Ravindra : “ఎవరు మీలో కోటీశ్వరులు” షో లో తొలిసారి కోటి రూపాయలు గెలుచుకున్న ఎస్ఐ
NTR వ్యాఖ్యాతగా జెమినీ టీవీ చానల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతి పెద్ద గేమ్ షో "ఎవరు మీలో కోటీశ్వరులు". ఈ షోలో హిస్టరీ క్రియేట్ అయ్యింది. తొలిసారి ఓ వ్యక్తి కోటి రూపాయలు..

Raja Ravindra
Raja Ravindra : NTR వ్యాఖ్యాతగా జెమినీ టీవీ చానల్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అతి పెద్ద గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”. ఈ షోలో హిస్టరీ క్రియేట్ అయ్యింది. తొలిసారి ఓ వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్నారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలానికి చెందిన బి. రాజారవీంద్రను ఈ అదృష్టం వరించినట్టు ప్రోమో ద్వారా తెలుస్తోంది. రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి బీవీఎస్‌ఎస్ రాజు-శేషుకుమారి దంపతుల కుమారుడు రాజారవీంద్ర డీజీపీ క్యాంపు కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్నారు.
Tongue Color : ఆరోగ్యాన్ని చెప్పే నాలుక రంగు..
రాజారవీంద్ర ఈ షోలోని మొత్తం 15 ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇచ్చి కోటి రూపాయలు గెలుచుకున్నట్టు సమాచారం. హోస్ట్ ఎన్టీఆర్ కోటి రూపాయల ప్రశ్న సంధించగా రాజారవీంద్ర సమాధానం చెప్పి దానిని ఫిక్స్ చేయమనడం ప్రోమోలో కనిపిస్తోంది. ఇప్పుడీ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యింది. కాగా, ఈ ఎపిసోడ్ ప్రసారం కావాల్సి ఉంది.
జెమినీ టీవీలో ప్రసారమవుతున్న “ఎవరు మీలో కోటీశ్వరులు” షో.. విజ్ఞానం, వినోదంతో NO.1 గేమ్ షో గా ఇంటిల్లిపాదిని అలరిస్తోంది. ఇప్పటిదాకా ఈ షో లో కంటెస్టెంట్స్.. హాట్ సీట్ లో కూర్చుని వారి అనుభవాల్ని, వారి లక్ష్యాలను NTRతో పంచుకుంటూ… ఉత్కంఠభరితంగా ఆడుతూ ఎన్టీఆర్ వేసిన ప్రశ్నలు ఒక్కొక్కటి దాటుకుంటూ లక్షల కొద్ది రూపాయలు గెలుచుకున్నారు.
అయితే ఈ షో లో అత్యధిక నగదు కోటి రూపాయలు గెలుచుకున్న తొలి కంటెస్టెంట్ గా సరికొత్త రికార్డును సృష్టించారు 33 ఏళ్లు బి.రాజా రవీంద్ర. రాజా రవీంద్ర క్రీడా రంగంలో కూడా దిట్ట. గన్ షూటింగ్ లో జాతీయ అంతర్జాతీయ పోలీస్ క్రీడా పోటీల్లో పాల్గొని ఎన్నో పతకాలను సాధించారు. ఎప్పటికైనా ఒలింపిక్స్ లో పాల్గొని ఎయిర్ రైఫిల్ షూటింగ్ లో మెడల్ సాధించాలన్నది రాజారవీంద్ర లక్ష్యం. అది నెరవేరడం కోసం గెలుచుకున్న కోటి రూపాయల నగదు ఉపయోగిస్తానని ఆయన చెప్పారు.
Copper : రాగిపాత్రలో నీళ్ళు తాగితే రోగాలు మాయం?
“ఎవరు మీలో కోటీశ్వరులు” షో లో వ్యాఖ్యాత ఎన్టీఆర్ చెప్పినట్లుగా “ఆట నాది కోటి మీది” కొటేషన్ అక్షర సత్యం చేస్తూ కంటెస్టెంట్ బి. రాజారవీంద్ర తన కలను నిజం చేసుకుని “తెలుగు టెలివిజన్ చరిత్రలోనే సరికొత్త రికార్డ్ సృష్టించారు. మరి ఈ మహా ఎపిసోడ్ లో NTR, కంటెస్టెంట్ రాజారవీంద్రను ఏ ప్రశ్నలు వేశారు. కోటి రూపాయల ప్రశ్న దాకా ఎంత ఉత్కంఠభరితంగా ఆట కొనసాగింది? తెలియాలంటే జెమినీ టీవీలో సోమ, మంగళవారాల్లో రాత్రి 8.30 ని.లకు ప్రసారమయ్యే “ఎవరు మీలో కోటీశ్వరులు” కోటి రూపాయల అద్భుత ఎపిసోడ్ ను తప్పక చూడండి.
Evaru Meelo Koteeswarulu | Gemini TV
Emk Milestone episode repu mee GeminiTv lo#EMKbyNTRonGeminiTV #EvaruMeeloKoteeswaruluOnGeminiTV #EvaruMeeloKoteeswarulu pic.twitter.com/nNq0vusqyk— Gemini TV (@GeminiTV) November 14, 2021