RSS Chief Mohan Bhagwat : భారత్‌లో నివసించేవారంతా హిందువులే .. అందరి DNA ఒక్కటే : మోహన్ భగవత్
భారత్‌లో నివసించేవారంతా హిందువులే..అందరి DNA ఒక్కటే అని RSS చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.

Everyone living in India is ‘Hindu’, says RSS chief Mohan Bhagwat
All people of India are Hindus..Mohan Bhagwat : భారతదేశంలో నివసించేవారు ఏమతం వారైనా..ఏకులం వారైనా వారంతా హిందువులే అన్నారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. చత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లా అంబికాపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ..కులం, మతం, ఆహారపుటలవాట్లు ఏవైనా భారత్‌లో నివసిస్తున్న వారందరూ హిందువులేనని 1925 నుంచి (ఆర్‌ఎస్‌ఎస్ స్థాపించినప్పటి నుండి) ఆరెస్సెస్ ఇదే చెబుతోందని గుర్తు చేశారు. భారతీయుల డీఎన్ఏ ఒక్కేటేనని అన్నారు.
భిన్నత్వంలో ఏకత్వం భారతదేశం సొంతమని ..ప్రజల మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడమే హిందూత్వ సిద్ధాంతమని అన్నారు. 40 వేల సంవత్సరాల క్రితం అఖండ భారత్‌లో భాగమైన అందరి డీఎన్ఏ ఒక్కటేనన్నారు. భారతదేశాన్ని తమ ‘మాతృభూమి’గా భావించి, భిన్నత్వంలో ఏకత్వ సంస్కృతితో జీవించాలని కోరుకునే వారు, మతం, సంస్కృతి, భాష, ఆహారపు అలవాట్లు, సిద్ధాంతాలతో సంబంధం లేకుండా ఈ దిశగా కృషి చేసేవారంతా హిందువులే అన్నారు మోహన్ భగవత్.
Mohan Bhagwat: మసీదును సందర్శించిన RSS చీఫ్.. హిందూ, ముస్లిం DNA ఒకటే అంటూ స్టేట్మెంట్!
ప్రతి ఒక్కరు తమ సంస్కృతి సంప్రదాయాలను పాటించాలని పూర్వీకులు మనకు చెప్పారని, ఇతరుల విశ్వాసాలు, సంప్రదాయాలను మనమంతా గౌరవించాలని అన్నారు. సొంత లక్ష్యాల కోసం ఇతరుల సంపదను దోచుకునే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. కరోనా సమయంలో దేశమంతా కలిసి పోరాడిన విషయాన్ని భగవత్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. మన మధ్య ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా..క్లిష్ట పరిస్థితుల్లో ఒక్కటిగా నిలిచి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచామని భగవత్ ఈ సందర్భంగా భారతదేశం గొప్పతనాన్ని అభివర్ణించారు.
Mohan Bhagwat: జీవితాన్ని దేశానికి అంకితం చేస్తామని ప్రతిజ్ణ చేయండి: ఆర్ఎస్ఎస్ చీఫ్