Mohan Bhagwat: జీవితాన్ని దేశానికి అంకితం చేస్తామని ప్రతిజ్ణ చేయండి: ఆర్ఎస్ఎస్ చీఫ్

అందరూ ప్రతిజ్ణ చేయండి.. ఈ దేశం కోసం సమాజం కోసం పని చేస్తానని ఇప్పుడే ప్రతిజ్ణ చేయండి. అవసరమైతే దేశం కోసం ఉరికంభాలని ముద్దాడటానికి కూడా ప్రతిజ్ణ చేయండి. మనం దేశం కోసం పని చేద్దాం. భారత్ కోసం పాడుదాం. భారత్ కోసం నినదిద్దాం. ఈ జీవితాన్ని దేశం కోసం అర్పిస్తానని ప్రతిజ్ణ చేయండి

Mohan Bhagwat: జీవితాన్ని దేశానికి అంకితం చేస్తామని ప్రతిజ్ణ చేయండి: ఆర్ఎస్ఎస్ చీఫ్

Life should be dedicated to India says RSS chief

Mohan Bhagwat: దేశం కోసం సమాజం కోసం పని చేస్తానని, దేశం కోసం జీవితాన్ని అర్పిస్తానని ప్రతిజ్ణ చేయాలని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అధినేత మోహన్ భాగవత్ పిలుపునిచ్చారు. దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నాగపూర్‭లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ‘ఉత్తిష్ఠ భారత్’ అనే కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ దేశం కోసం పని చేయాలని, పాటు పడాలని అన్నారు.

‘‘అందరూ ప్రతిజ్ణ చేయండి.. ఈ దేశం కోసం సమాజం కోసం పని చేస్తానని ఇప్పుడే ప్రతిజ్ణ చేయండి. అవసరమైతే దేశం కోసం ఉరికంభాలని ముద్దాడటానికి కూడా ప్రతిజ్ణ చేయండి. మనం దేశం కోసం పని చేద్దాం. భారత్ కోసం పాడుదాం. భారత్ కోసం నినదిద్దాం. ఈ జీవితాన్ని దేశం కోసం అర్పిస్తానని ప్రతిజ్ణ చేయండి’’ అని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి మోహన్ భాగవత్ అన్నారు.

నిన్నటి వరకు ఆర్ఎస్ఎస్, మోహన్ భాగవత్‭లపై విపక్షాలు, నెటిజెన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గతేడాది నుంచే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ పేరుతో ఏడాదిపాటు వేడుకలు నిర్వహిస్తోంది. కాగా, 75వ వార్షికోత్సవం దగ్గర పడిన తరుణంలో దేశంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండాను సగర్వంగా ఎగురవేయాలని, అలాగే సోషల్ మీడియా ఖాతాల్లో త్రివర్ణ పతాకాన్ని డీపీగా మార్చుకోవాలని జూలైలో నిర్వహించిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు.

అయితే ఆర్ఎస్ఎస్, మోహన్ భాగవత్ డీపీలు నిన్నటి వరకు మారలేదు. దీంతో ప్రధాని చేసిన సూచన సొంతింటికే చేరలేదంటూ విమర్శలు గుప్పించారు. ఎట్టకేలకు శనివారం ఆర్ఎస్ఎస్ సహా ఇతరుల డీపీలు త్రివర్ణ పతాకంలోకి మారాయి.

RSS changed DP: విమర్శల నడుమ ఎట్టకేలకు డీపీ మార్చిన ఆర్ఎస్ఎస్