Mohan Bhagwat Visits Masjid: మోహన్ భగవత్ ముస్లీం మత ప్రముఖలతో భేటీపై.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమన్నారంటే..

ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ముస్లిం మత పెద్దలతో భేటీపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేవలం పదిహేను రోజులు మాత్రమే పూర్తి చేసిందని, మోహన్ భగవత్ మదర్సాకు వెళ్లారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు.

Mohan Bhagwat Visits Masjid: మోహన్ భగవత్ ముస్లీం మత ప్రముఖలతో భేటీపై.. కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమన్నారంటే..

Mohan Bagavath

Mohan Bhagwat Visits Masjid: ముస్లీం మత ప్రముఖులతో ఇటీవల వరుస సమావేశాలు నిర్వహిస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ గురువారం దేశ రాజధానిలో ఓ మసీదును, మదర్సాను సందర్శించారు. మదర్సాలో విద్యార్థులతో మాట్లాడారు. వారు ఖురాన్ పఠిస్తుండగా విన్నారు. ఆ తరువాత విద్యార్థులు జైహిందు, వందేమాతరం నినాదాలు చేశారు. అయితే, ఓ మదర్సాను భగవత్ దర్శించడం ఇదే తొలిసారి.

Asaduddin Owaisi: ఆర్ఎస్ఎస్ చీఫ్‭ను కలిసిన ముస్లిం నేతలపై మండిపడ్డ ఓవైసీ
మోహన్ భగవత్ ముస్లిం నేతలతో భేటీ కావటం పట్ల ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ‘ఎంతో తెలివైన వారమని, తమకన్నీ తెలుసని అనుకునే ఈ ఉన్నతమైన వ్యక్తులకు (ఐదుగురు ముస్లిం నేతలు) వాస్తవ పరిస్థితుల గురించి అవగాహన లేదు. సుఖమైన, సౌకర్యవంతమైన జీవితాలు గడుపుతున్న వారు ఆర్ఎస్ఎస్ అధినేతను కలుసుకోవడంలో ఆశ్చర్యం లేదు. నిజానికి అది వారి ప్రజాస్వామ్య హక్కు కూడా. వారి హక్కును మేం కాదనట్లేదు. అలాఅని వారిని మేము ప్రశ్నించడమూ లేదు. కానీ మమ్మల్ని ప్రశ్నించే హక్కు వారికి లేదని అసదుద్దీన్ విరుచుకపడ్డారు.

Wife Illegal Affair: ప్రియుడితో కలిసి భర్తను హత్యచేసిన భార్య.. ఐదు నెలల తర్వాత నిందితులను పట్టించిన సెల్ ఫోన్.. ఎలా అంటే?

భగవత్, ముస్లిం మత పెద్దల భేటీపై కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కేవలం పదిహేను రోజులు మాత్రమే పూర్తి చేసిందని, మోహన్ భగవత్ చీఫ్ ఇమామ్‌ను కలిసేందుకు వెళ్లారని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా అన్నారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ మాట్లాడుతూ.. మోహన్ భగవత్ త్రివర్ణ పతాకాన్ని తీసుకొని రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనలని సూచించారు. కొన్ని రోజుల యాత్ర భగవత్‌పై అంత ప్రభావం చూపినప్పుడు, అతను ఒక గంట పాటు భారత్ జోడో యాత్రలో పాల్గొనాలని, చేతిలో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని రాహుల్ గాంధీతో కలిసి నడవాలని, ‘భారత్ మాతా కీ’ నినాదం చేయాలని భగవత్‌ను కోరుతున్నామని అన్నారు.