CR Kesavan: బీజేపీలోకి కాంగ్రెస్ నేతల చేరిక పర్వం.. తాజాగా దేశ తొలి గవర్నర్ మునిమనువడు

జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యతను తిరస్కరించాను. ఈ కారణం చేతనే భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొనలేక పోయాను. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం కోసం పనిచేయడానికి నన్ను ప్రోత్సహించిన విలువలు ప్రస్తుతం ఏమాత్రం కనిపించడం లేదు

CR Kesavan: బీజేపీలోకి కాంగ్రెస్ నేతల చేరిక పర్వం.. తాజాగా దేశ తొలి గవర్నర్ మునిమనువడు

CR Kesavan

Updated On : April 8, 2023 / 3:32 PM IST

CR Kesavan: కాంగ్రెస్ పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. నిన్నటికి నిన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోని కుమారుడు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. కాగా వెటరన్ కాంగ్రెస్ నేత, దేశ తొలి గవర్నర్ అయిన జనరల్ సి.రాజగోపాలచారి మునిమనుమడు, కాంగ్రెస్ మాజీ నేత సీఆర్ కేశవన్ శనివారం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీలో తనకు చోటు కల్పించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నట్లు చేరిక అనంతరం కేశవన్ అన్నారు.

Jogi Ramesh : చంద్రబాబు.. నేను రెడీగా ఉన్నా, మీరు రెడీయా? : మంత్రి జోగి రమేశ్

తనను పార్టీలోకి తీసుకోవడం సి.గోపాలచారితో సహా దేశ నిర్మాణంలో పాలుపంచుకున్న మహనీయుల పట్ల బీజేపీకి ఉన్న గౌరవానికి నిదర్శనమని కేశవన్ అన్నారు. ప్రజల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమలు చేస్తున్న విధానాలు, అవినీతిరహిత పాలన మారుతున్న భారతదేశాన్ని ఆవిష్కరిస్తోందని పేర్కొన్నారు. దీనికి ముందు, కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కేశవన్ రాజీనామా చేశారు. ఆ రాజీనామా లేఖను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. అందులో తన రాజీనామాకు కారణాలను అందులో వివరించారు.

Droupadi Murmu : సుఖోయ్‌ యుద్ధ విమానంలో ప్రయాణించిన ద్రౌపది ముర్ము

‘‘కాంగ్రెస్ పార్టీ వ్యక్తిననే గుర్తింపుతో ఇక ఎంతమాత్రం ఉండలేను. అందుకే జాతీయ స్థాయిలో సంస్థాగత బాధ్యతను తిరస్కరించాను. ఈ కారణం చేతనే భారత్ జోడో యాత్రలో కూడా పాల్గొనలేక పోయాను. రెండు దశాబ్దాలుగా పార్టీ కోసం కోసం పనిచేయడానికి నన్ను ప్రోత్సహించిన విలువలు ప్రస్తుతం ఏమాత్రం కనిపించడం లేదు. అందుకు విచారం వ్యక్తం చేస్తున్నాను. పార్టీ దేనికి గుర్తుగా ఉందో, దేని కోసం మద్దతుగా నిలుస్తోందో, దానితో నేను ఏకీభవిస్తున్నట్లు మనస్ఫూర్తిగా చెప్పలేను. వాటిని ప్రచారం చేయలేను. అందుకే సంస్థాగత పదవిని తిరస్కరించాను. ఇప్పుడు నూతన పంథాను నిర్మించుకోవాల్సిన తరుణం వచ్చింది. పార్టీలో నాకు వివిధ పదవులు ఇచ్చిన సోనియాగాంధీకి కృతజ్ఞతలు’’ అని తన రాజీనామా లేఖలో కేశవన్ పేర్కొన్నారు.