Jogi Ramesh : చంద్రబాబు.. నేను రెడీగా ఉన్నా, మీరు రెడీయా? : మంత్రి జోగి రమేశ్

టిట్కో ఇళ్లపై చంద్రబాబు ట్వీట్ కి సమాధానం చెప్పటానికి నేను సిద్దంగా ఉన్నాను..మరి రూ. కోటి యాభై లక్షల ఇళ్ల దగ్గరకు రావటానికి సిద్దంగా ఉన్నారా? అంటూ ప్రతి సవాల్ విసిరారు జోగి రమేశ్.

Jogi Ramesh : చంద్రబాబు.. నేను రెడీగా ఉన్నా, మీరు రెడీయా? : మంత్రి జోగి రమేశ్

Jogi Ramesh's challenge to Chandrababu

Jogi Ramesh : నెల్లూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు మార్గ మధ్యలో అక్కడి టిడ్కో ఇళ్లను పరిశీలించారు. అక్కడ సెల్ఫీ దిగి ఆ ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ..సీఎం జగన్ కు సవాల్ విసిరారు. చూడు… @ysjagan..ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు ఒక్క నెల్లూరులోనే కట్టిన వేలాది టిడ్కో ఇళ్ళు. రాష్ట్రంలో నాడు నిర్మించిన లక్షల టిడ్కో ఇళ్లకు సజీవ సాక్ష్యాలు.. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లెన్ని? నువ్వు చెప్పిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా? అంటూ విసిరారు.

చంద్రబాబు విసిరిన ఈ సవాలుపై మంత్రి జోగి రమేశ్ స్పందించారు.టిట్కో ఇళ్లపై చంద్రబాబు ట్వీట్ కి సమాధానం చెప్పటానికి నేను సిద్దంగా ఉన్నాను..మరి ఒక కోటి యాభై లక్షల ఇళ్ల దగ్గరకు రావటానికి సిద్దంగా ఉన్నారా? అంటూ ప్రతి సవాల్ విసిరారు జోగి రమేశ్. జగనన్న కాలనీల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని తెలిపిన జోగి.. మాతో వస్తే చంద్రబాబుకు చూపిస్తాం అంటూ పిలుపునిచ్చారు. 14 సంవత్సరాలలో చంద్రబాబు ఏం చేశారో? 4 సంవత్సరాలలో జగన్ ఏం చేశారో చర్చిద్దామా? అంటూ సవాల్ విసిరారు. మేము మంచి చేసినందునే ధైర్యంగా ప్రజల ఇళ్లకే వెళ్లి చెప్పుకుంటున్నాం. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే నా ఛాలెంజ్ ని కూడా స్వీకరించాలన్నారు. కోటి యాభై లక్షల ఇళ్లకు వెళ్లి నీ హయాంలో ఏం చేశావో అడుగుదాం .. డ్వాక్రా మహిళలకు మీరు ఏం చేశావో అడుగుదామని అన్నారు. అలాగే అమ్మ ఒడి డబ్బులు నువ్వు ఎందుకు ఇవ్వలేక పోయావో అడుగుదాం.. పెన్షన్, రేషన్ ఇళ్ల దగ్గరే అందిస్తున్న వైనంపై చర్చిద్దాం రా.. అంటూ పిలుపునిచ్చారు.

Rudraraju Gidugu: కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థుడు.. వెన్నుపోటు పొడిచి పారిపోయాడు

తమ ప్రభుత్వం అమలు చేసే పథకాలు చూసి చంద్రబాబుకు మూర్చరోగం వచ్చిందని ఎద్దేవా చేసిన జోగి రమేశ్ 14 ఏళ్లు సీఎంగా ఉండి కాలక్షేపం చేస్తూ కబుర్లు చెప్పారంటూ విమర్శించారు. ‘15 వేలకు పైగా జగనన్న కాలనీలు కడుతున్నాం. ఇవన్నీ చూపిస్తాం రమ్మని చంద్రబాబుకు చాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబుకి, లోకేశ్ కు ఇదే మా ఛాలెంజ్.. పాదయాత్రకు రమ్మన్నా వస్తా.. లేదా నేను చెప్పిన చోటకు రండి చర్చిద్దాం రండీ. మీ హయాంలో, మా హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై చర్చిద్దాం. మీరు సమాధానాలు చెప్పగలరా’ అంటూ ప్రశ్నించారు. కుప్పంలో చంద్రబాబు కుప్పకూలడం ఖాయం అంటూ జోస్యం చెప్పిన జోగి రమేశ్ 175 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలపెట్టలేని చంద్రబాబు సవాల్ చేయటం సిగ్గుచేటు అని.. పొత్తుల్లేకుండా పోటీ చేయలేని చంద్రబాబు కూడా మమ్మల్ని విమర్శించటమా అంటూ ఎద్దేవా చేశారు.

Bhuma Jagat Vikhyat Reddy : నంద్యాల బరిలోకి దిగుతున్నా.. కాళ్లు పట్టుకొని క్షమాపణ అడిగితేనే..