OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష

అక్రమాస్తులు కలిగి ఉన్నారనే కారణంతో హర్యాణా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ కోర్టు. దీంతోపాటు యాభై లక్షల జరిమానా విధిస్తూ, నాలుగు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది.

OP Chautala: అక్రమాస్తుల కేసు.. మాజీ సీఎంకు జైలు శిక్ష

Op Chautala

OP Chautala: అక్రమాస్తులు కలిగి ఉన్నారనే కారణంతో హర్యాణా మాజీ సీఎం ఓం ప్రకాష్ చౌతాలాకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది ఢిల్లీ కోర్టు. దీంతోపాటు యాభై లక్షల జరిమానా విధిస్తూ, నాలుగు ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని తీర్పునిచ్చింది. ప్రత్యేక జడ్జి వికాస్ దల్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం ఈ తీర్పు వెలువరించింది.

Fake Reviews: ఆన్‌లైన్‌ ఫేక్ రివ్యూలపై కేంద్రం దృష్టి

చౌతాలా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, శిక్ష తగ్గించాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును కోరారు. అయితే, ఈ ప్రతిపాదనను సీబీఐ తరఫు న్యాయవాదులు తిరస్కరించారు. ఆయనకు శిక్ష తగ్గిస్తే, అది సమాజంలోకి చెడు సందేశాన్ని పంపుతుందని సీబీఐ తరఫు లాయర్లు వాదించారు. ఆయనకు గరిష్ట శిక్ష విధించాలని కోరారు. ‘‘నిందితుడు ప్రజాదరణ కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తికి శిక్ష తగ్గిస్తే, అది తప్పుడు సందేశాన్ని పంపినట్లవుతుంది. అతడికి గతంలో ఉన్నతమైన చరిత్ర ఏమీ లేదు. అక్రమాస్తులు, అవినీతికి సంబంధించి ఇది ఆయనపై మోపిన రెండో కేసు. కాబట్టి, ఆయనకు తగిన శిక్ష విధించాలి’’ అని సీబీఐ కోరింది. సీబీఐ చౌతాలాపై మార్చి 26, 2010న చార్జిషీటు దాఖలు చేసింది.

Delhi riots: ఇంటికొచ్చిన ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు.. స్థానికుల ఘన స్వాగతం

ఆయన 1993-2006 వరకు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.6.09 కోట్ల అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు సీబీఐ ఆరోపించింది. దీనిపై ఇంతకాలంగా విచారణ జరుగుతూ వచ్చింది. తాజాగా ఆయనకు శిక్ష ఖరారు చేస్తూ ఢిల్లీ కోర్టు తీర్పునిచ్చింది. గతంలో కూడా ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. తాజాగా విధించిన శిక్ష రెండోది.