Delhi riots: ఇంటికొచ్చిన ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు.. స్థానికుల ఘన స్వాగతం

ఢిల్లీలో 2020లో జరిగిన ఘర్షణల్లో నిందితుడు పెరోల్‌పై విడుదలకాగా, అతడికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు తాజాగా మీడియాకు విడుదల చేశారు.

Delhi riots: ఇంటికొచ్చిన ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడు.. స్థానికుల ఘన స్వాగతం

Delhi Riots

Updated On : May 27, 2022 / 1:12 PM IST

Delhi riots: ఢిల్లీలో 2020లో జరిగిన ఘర్షణల్లో నిందితుడు పెరోల్‌పై విడుదలకాగా, అతడికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ఈ ఘటన గత సోమవారం జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను పోలీసులు తాజాగా మీడియాకు విడుదల చేశారు. కేంద్రం రూపొందించిన సీఏఏ చట్టానికి వ్యతిరేకంగా 2020లో జరిగిన నిరసనలు ఘర్షణలకు దారితీసిన సంగతి తెలిసిందే.

Ambassador Car: రెండేళ్లలో మళ్లీ రానున్న అంబాసిడర్ కార్

ఈ సందర్భంగా ఢిల్లీలో భారీ ఎత్తున అల్లర్లు జరిగాయి. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ ఘర్షణల్లో ఢిల్లీకి చెందిన షారుఖ్ పఠాన్ అనే వ్యక్తి పోలీసులకు ఏకంగా తుపాకీ గురిపెట్టాడు. దీనికి సంబంధించిన ఫొటోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తర్వాత అతడ్ని పోలీసులు అరెస్టు చేశారు. అల్లర్లకు కారణమైనందుకుగాను ఢిల్లీ కోర్టు షారుక్‌కు జైలు శిక్ష విధించింది. జైలులోనే ఉంటున్న అతడికి ఇటీవల కోర్టు నాలుగు గంటలు పెరోల్ ఇచ్చింది. జబ్బుతో బాధపడుతున్న, వృద్ధుడైన అతడి తండ్రిని చూసేందుకు కోర్టు అతడికి నాలుగు గంటల పెరోల్ మంజూరు చేసింది.

Leopard Burnt: చిరుతను సజీవ దహనం చేసిన గ్రామస్తులు.. 150 మందిపై కేసు

కాగా, ఈ నెల 23న షారుక్ తండ్రిని చూసేందుకు తన ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా అతడికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. భారీ సంఖ్యలో హాజరైన జనం అతడి వెంటే నడిచారు. భారీ ఎత్తున నినాదాలు చేశారు. కాగా, మార్చి 3, 2020 నుంచి షారుక్ జైల్లో ఉంటున్నాడు. అతడికి పోలీసులను కాల్చే ఉద్దేశం లేదని, కేవలం గాల్లోకి మాత్రమే కాల్పులు జరిపాడనే కారణంతో కోర్టు తక్కువ శిక్ష విధించింది.