Ponguleti Srinivas Reddy : మాయల మరాఠిని నమ్మి మరోసారి మోసపోవద్దు- పొంగులేటి

Ponguleti : రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగుల్లో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలని సీఎం కేసీఆర్ ను ఆయన నిలదీశారు.

Ponguleti Srinivas Reddy : మాయల మరాఠిని నమ్మి మరోసారి మోసపోవద్దు- పొంగులేటి

Ponguleti Srinivas Reddy

Ponguleti Srinivas Reddy – KCR : తెలంగాణ ప్రభుత్వంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తొమ్మిదేళ్ల పాలనలో కేసీఆర్ కు బీసీలు ఇప్పుడు గుర్తుకొచ్చారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతోనే సీఎం కేసీఆర్ బీసీల ప్రస్తావన తీసుకొచ్చారని పొంగులేటి మండిపడ్డారు.

రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? నిరుద్యోగుల్లో ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చారో చెప్పాలని సీఎం కేసీఆర్ ను ఆయన నిలదీశారు. కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారని, మరోసారి కేసీఆర్ మాయమాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు. మంత్రి పువ్వాడ అజయ్ దోపిడీలు, భూకబ్జాలకు అంతులేకుండా పోయిందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో పువ్వాడ అజయ్ ని ఓడించి ఖమ్మంలో మార్పు తీసుకొస్తానన్నారు పొంగులేటి శ్రీనివాస రెడ్డి.

Also Read..Kothagudem: ఆ పార్టీలోకి వెళ్లిపోదామా? తన అనుచరులను అడుగుతున్న మాజీ ఎమ్మెల్యే?

ఖమ్మంలో ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి కామెంట్స్:
” ఎన్నికలకు ఇక నాలుగు నెలలు సమయం ఉందనగా మీకు బీసీలు గుర్తుకొచ్చారా? ఈ తొమ్మిదేళ్లు బీసీలు ఏమైపోయారు కేసీఆర్ గారు? చంద్రశేఖర రావు గారు మాయమాటలతో ఎన్నాళ్ళు మోసం చేస్తారు? ఈ మాయల మరాఠిని నమ్మొద్దు. కేసీఆర్ మాటలు నమ్మొద్దు.
తొమ్మిదేళ్ల పాలనలో నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారు? ఎంతమంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు కేసీఆర్? రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఎదురు నిలిచిన వాడు ఎంత బలవంతుడైనా భూస్తాపితం చేయాలన్నదే సంకల్పం.

ఖమ్మంలో మంత్రి అజయ్ అనుచరుల ఆగడాలకు, భూకబ్జాల కు అంతు లేకుండా పోయింది. మంత్రి అనుచరుల దోపిడీకి అంతు లేదు. చివరకు మట్టిగుట్టలు కూడా వదలలేదు. అయ్యా మంత్రి గారు ఖమ్మం నియోజకవర్గ ప్రజలు కులమతాలకు అతీతంగా ఎవరికి వారు ప్రశాంతంగా అన్నం తినగలిగే పరిస్దితి ఉందా? మంత్రిగారు రోడ్లకు లైట్లు పెట్టడమే అభివృద్దా?

Also Read..Bandi Sanjay : 111 జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల స్కామ్, కారు చౌకగా కొట్టేసేందుకు ప్లాన్- బండి సంజయ్ సంచలన ఆరోపణలు

మంత్రి గారు.. రాజ్యం ఎప్పుడూ మీ చేతిలో ఉండదు. ప్రజలు తలచుకుంటే ఎంతటి పుడింగు అయినా ఇంటికి పోక తప్పదు. ప్రజలు పమయం కోసం ఎదురుచూస్తున్నారు. అధికారం మీ అబ్బ సొత్తు కాదు. ప్రజల ముందు ఎవరైనా తలవంచాల్సిందే. యావత్ తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఖమ్మంలో నేనే పోటీ చేయాల్సిన పని లేదు. బచ్చాగాడిని పెట్టి ఓడిస్తా. పోలీసులు మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి. 5 నెలల తరువాత మీరే మా ప్రజాప్రతినిధుల వద్దకు వచ్చి క్షమాపణ చెప్పి విత్ డ్రా చేయాల్సిన పరిస్థితి వస్తుంది.

తెలంగాణలో ఎక్కడ చూసినా కబ్జాలు, దోపిడీలే- జూపల్లి కృష్ణారావు
” ఏం పాపం చేశారని, ఏం తప్పు చేశారని.. కోదండరాం ఇంటి తలుపులు బద్దలు కొట్టి మరీ అరెస్ట్ చేసి అవమానించారు. కేసీఆర్.. నిజాం నీకన్నా ఎక్కువ అభివృద్దే చేశాడు. తెలంగాణలో అరాచక, అక్రమ పాలన కొనసాగుతోంది. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను ఖతం చేయాలంటున్నారు కేసీఆర్.

తొమ్మిదేళ్లలో మీరిచ్చిన హామీలు ఏమయ్యాయి? మ్యానిఫెస్టో అంటే ఖురాన్, భగవద్గీత అన్నారే. మరి మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారు? అబద్దాలు, దొంగ లెక్కలతో రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మోసం చేస్తున్నారు. తెలంగాణలో ఎక్కడ చూసినా కబ్జాలు, దోపిడీలే. ఎక్కడ చూసినా అశాంతి. తెలంగాణలో పోలీసులను అడ్డం పెట్టుకుని నాయకులు రజాకారుల పాలన తలపించే విధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి”.