Kothagudem: ఆ పార్టీలోకి వెళ్లిపోదామా? తన అనుచరులను అడుగుతున్న మాజీ ఎమ్మెల్యే?

జలగం వెంకట్రావుతో కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

Kothagudem: ఆ పార్టీలోకి వెళ్లిపోదామా? తన అనుచరులను అడుగుతున్న మాజీ ఎమ్మెల్యే?

Jalagam Venkat Rao

Jalagam Venkat Rao: పార్టీ మారే విషయంపై బీఆర్ఎస్ (BRS) నేత, మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు తన అనుచరులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ(Telangana)లోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం, పట్వారిగూడెం గ్రామంలో పామ్ ఆయిల్ తోటలో ఆయన తన అనుచరులతో సమావేశమయ్యారు.

ఒక ప్రైవేట్ ఫంక్షన్ కార్యక్రమంలో భాగంగా అనుచరులతో సమావేశమైన జలగం వెంకట్రావు వారి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ జెండాలు లేకుండా అనుచరులతో ప్రత్యేకంగా సమావేశం కావడం హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీపై జలగం వెంకట్రావు అసంతృప్తితో ఉన్నారు.

కొత్తగూడెం టికెట్… సీపీఐ, బీఆర్ఎస్ పోత్తులో భాగంగా సీపీఐకి వెళ్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అనుచరులతో ఆయన చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు, జలగం వెంకట్రావుతో కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో టికెట్ దక్కుతుందా? దక్కదా? అన్న ఆందోళనలో పలు పార్టీల నేతలు ఉన్నారు.

DK Shivakumar: 135 సీట్లు గెలిచాం.. అయినా నేను హ్యాపీగా లేను.. ఎందుకంటే?: డీకే శివకుమార్