Bandi Sanjay : 111 జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల స్కామ్, కారు చౌకగా కొట్టేసేందుకు ప్లాన్- బండి సంజయ్ సంచలన ఆరోపణలు

111 GO: కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టివ్వాలి. బీఆర్ఎస్ అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

Bandi Sanjay : 111 జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల స్కామ్, కారు చౌకగా కొట్టేసేందుకు ప్లాన్- బండి సంజయ్ సంచలన ఆరోపణలు

Bandi Sanjay (Photo : Twitter, Google)

Bandi Sanjay – 111 Go Scrap : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ బీఆర్ఎస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. 111 జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల సామ్ ఉందని ఆయన ఆరోపించారు. పేదల నుంచి కారు చౌకగా భూములను కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు కొట్టేశారని బండి సంజయ్ అన్నారు.

ఆదిలాబాద్ జిల్లాలో బండి సంజయ్ మాట్లాడారు. కోకాపేట భూమి మీ అయ్య జాగీరనుకున్నావా కేసీఆర్ అని ఫైర్ అయ్యారు బండి సంజయ్. కోకాపేట్ లో హెచ్ఎండీఏ గజానికి లక్ష పది వేలకు అమ్ముతుంది. మరి.. గజానికి 7,500 చొప్పున 11 ఎకరాల భూమిని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా కట్టబెడతారు? అని ఆయన ప్రశ్నించారు. భూకేటాయింపును కేబినెట్ లో ఆమోదించుకుని ప్రజలకు తెలియకుండా దాచాలనుకుంటారా? అని నిలదీశారు. పేదలు తలదాచుకోవడానికి స్థలాలే లేవని చెబుతున్న కేసీఆర్.. మీ పార్టీకి మాత్రం భూములెలా వచ్చాయి? అని అడిగారు. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయంతో పాటు జిల్లా కార్యాలయాల పేరుతో కారు చౌకగా స్థలాలు కొట్టేసింది చాలదా? అని ధ్వజమెత్తారు.

Also Read.. Minister Kishan Reddy: పోస్టర్లు వేసినంత మాత్రాన దేశ్‌కీ నేత కారు.. రైతుబంధు కంటే.. మేమిచ్చే ఎరువుల సబ్సిడీ ఎక్కువ

” గతంలో కాంగ్రెస్ పార్టీ బోయిన్ పల్లిలో ఇదే తరహాలో 10 ఎకరాలకు పైగా స్థలాన్ని కొట్టేసింది. బీఆర్ఎస్-కాంగ్రెస్ కలిసే దోచుకుంటున్నాయి. కలిసే అధికారాన్ని పంచుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ కలిసే పోటీ చేయబోతున్నాయి. బీజేపీ గ్రాఫ్ ను తగ్గించేందుకు లీడర్లు పార్టీని వీడుతున్నారంటూ ఆ రెండు పార్టీలు, ఒక సెక్షన్ మీడియా దుష్ప్రచారం చేస్తున్నాయి.

బీజేపీ భగభగమండే సూరీడు లాంటి పార్టీ. మబ్బులను చూసి సూరీడు కాంతి తగ్గిందనుకోవడం భ్రమ. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల స్కామ్ దాగుంది. పేదల వద్ద కారు చౌకగా భూములను కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ నేతలు కొట్టేశారు. ట్రిపుల్ వన్ జీవో ఎత్తేసిన తర్వాత గజాల లెక్క రియల్ ఎస్టేట్ పేరుతో లక్షల కోట్ల దందాకి కేసీఆర్ కుటుంబం ప్లాన్ చేసింది.

Also Read..Nizamabad Rural Constituency: బాజిరెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నిలుస్తారా.. నిజామాబాద్ రూరల్‌లో ఇంట్రస్టింగ్ పాలిటిక్స్?

బీఆర్ఎస్ అక్రమాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కోకాపేట భూముల కేటాయింపు ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. ఆ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టివ్వాలి. ఎన్నికలు గుర్తొచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు పేదలు గుర్తుకొస్తారు. పేదల స్థలాల్లోనే కలెక్టరేట్లు, ఫైర్ స్టేషన్లు, కాలేజీలు కడతామంటున్నారు. ధరణి పేరుతో రైతులను ఏ విధంగా మోసం చేస్తున్నారో.. బీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా లాభపడ్డారో జగమెరిగిన సత్యం” అని బండి సంజయ్ అన్నారు.