Minister Kishan Reddy: పోస్టర్లు వేసినంత మాత్రాన దేశ్‌కీ నేత కారు.. రైతుబంధు కంటే.. మేమిచ్చే ఎరువుల సబ్సిడీ ఎక్కువ

ప్రతి బస్తా మీద అసలు ధర 3561 రూపాయలు, కేంద్రం ఇచ్చే సబ్సిడీ 2261 రూపాయలు, రైతులు ఇచ్చేది 1300 మాత్రమేనని కిషన్ రెడ్డి అన్నారు.

Minister Kishan Reddy: పోస్టర్లు వేసినంత మాత్రాన దేశ్‌కీ నేత కారు.. రైతుబంధు కంటే.. మేమిచ్చే ఎరువుల సబ్సిడీ ఎక్కువ

Minister Kishan Reddy

Minister Kishan Reddy: ఇటీవల కురిసిన వర్షాలతో తెలంగాణ‌లో తీవ్ర‌గా పంట నష్టం జరిగింది. ప్రతి ఏడాది ఇలానే జరుగుతుంది. అయినా ప్రభుత్వం నుండి రైతుల‌కు ఎలాంటి సహాయం అందడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇతర రాష్ట్రాల్లో పంట బీమా ఉండటం వల్ల రైతులకు కాస్త ఉపశమనం ఇస్తుందని, తెలంగాణ‌లో పంటల బీమా అమలు చేయకపోవడం‌తో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం కూడా రాష్ట్రంలో పంటల బీమా పథకం అమలు చేయాలని కిషన్ సూచించారు. నిత్యం కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే కల్వకుంట్ల కుటుంభం పరిమితం మైనదని విమర్శించారు.

Central Minister Kishan Reddy: భయంకరమైన నిజాలు అంటూ.. కేసీఆర్ పాలనపై ఆసక్తికర ట్వీట్ చేసిన కిషన్ రెడ్డి

రాష్ట్రాన్ని సలహాదారులకు అప్పగించి.. మహారాష్ట్ర‌లో బీఆర్ఎస్ బ్రాంచ్ ఆఫీస్ పెట్టారని, తెలంగాణ సమస్యలు గాలికి వదిలేసి దేశ్‌కీ నేత అంటూ ప్రచారం చేసుకుంటున్నారని, పోస్టర్లు వేసినంత‌ మాత్రాన దేశ్ కీ నేత కారు అంటూ సీఎం కేసీఆర్ ను ఉద్దేశించి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ రైతుల‌కు కేవలం 10వేలు మాత్రమే ఇస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక ఎరువుల మీద సబ్సిడీ‌నే 18,454 ఇస్తుందని చెప్పారు. ఎకరాకు వినియోగించే యూరియా మీద 8వేలు, డీఏపీ మీద 9500 సబ్సిడీ ఇస్తుందని అన్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పెంచుతుందని చెప్పారు. కానీ,  కేసీఆర్ ఇస్తామన్న ఉచిత ఎరువు ఎక్కడకు పోయాయి, రైతుల‌కు ఇస్తామన్న 2,600 ఎక్కడ పోయిందని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Kishan Reddy: బంగారు బాతును చంపేశారు.. ఓఆర్ఆర్ విషయంలో కేసీఆర్‌పై మండిపడ్డ కిషన్ రెడ్డి ..

ప్రతి బస్తా మీద అసలు ధర  3,561 రూపాయలు, కేంద్రం ఇచ్చే సబ్సిడీ 2261 రూపాయలు, రైతులు చెల్లించేది 1300 మాత్రమేనని కిష‌న్ రెడ్డి అన్నారు. గతంలో రైతులకు వెళ్లాల్సిన యూరియా కెమికల్ కంపెనీలకు వెళ్లేద‌ని, నరేంద్రమోదీ తీసుకువచ్చిన డిజిటల్ విప్లవం వలన వాటిని అరికట్టడం జరిగిందని అన్నారు. మరోవైపు వేప పూత ఉన్న యూరియాను సప్లయ్ చేయడం ద్వారా పంటల దిగుబడి పెరుగుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వంసైతం రైతు సమ్మన్ నిధి క్రింద 6000 రూపాయలు ఇస్తున్నామని, రైతులు తమ పంటను దేశంలో ఎక్కడైనా నమ్ముకునే స్వేచ్ఛను ఇచ్చామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. నరేంద్రమోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కనీస మద్దతు ధర పెంచామని అన్నారు. కేంద్రం ఇచ్చే ట్రాక్టర్స్ బీఆర్ఎస్ నాయకులు, వారి బంధువులు పంచుకున్నారని విమర్శించారు. క్రాప్‌లోను ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని, భూసార పరీక్షలకు పైసలు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమేనని, ధాన్యం కొనుగోలు‌కు అయ్యే ఖర్చు మొత్తం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు 2021 – 22 టార్గెట్‌నే ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ ఫీల్ చేయలేదని కిషన్ రెడ్డి విమర్శించారు.

G Kishan Reddy : కిరణ్ కుమార్ రెడ్డి చేరిక బీజేపీపై ప్రభావం చూపదు-కిషన్ రెడ్డి

G20 సమావేశాల్లో భాగంగా 22, 23, 24 తేదీలో కల్చర్, టూరిజం డెలిగేట్స్ మీటింగ్ శ్రీనగర్‌లో జరుగుతుందని, 36 సంవత్సరల తరువాత శ్రీనగర్‌లో అంతర్జాతీయ స్థాయి మీటింగ్ జరుగుతుందని కిషన్ రెడ్డి చెప్పారు. ధాన్యం కొనుగోలులో సమస్యలు ఉంటే కేంద్రానికి రిప్రజెంటేషన్ ఇవ్వాలని, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తూ కేంద్రం ప్రభుత్వంపై విమర్శలు చేయడమేతప్ప బాధ్యతలు నిర్వర్తించడం లేదని కిషన్ రెడ్డి  ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కర్ణాటక పూర్తి స్థాయి మెజార్టీ ఇస్తే ముఖ్యమంత్రి ఎన్నుకోవడానికి మూడు చెరువుల నీళ్లు తాగారని ఎద్దేవా చేశారు.