Kishan Reddy: బంగారు బాతును చంపేశారు.. ఓఆర్ఆర్ విషయంలో కేసీఆర్‌పై మండిపడ్డ కిషన్ రెడ్డి ..

ఓఅర్ఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి బంగారు బాతు లాంటిది స్వార్థ ప్రయోజనాలకోసం కేసీఆర్ బంగారు బాతును చంపేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు.

Kishan Reddy: బంగారు బాతును చంపేశారు.. ఓఆర్ఆర్ విషయంలో కేసీఆర్‌పై మండిపడ్డ కిషన్ రెడ్డి ..

Union Minister Kishan Reddy

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉన్న ఓఅర్ఆర్ నిర్వహణ‌కోసం ప్రైవేట్ కంపెనీలను పిలవాలని, భాగస్వామ్యం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా ఈ బిడ్‌లో ఐఆర్‌బీ ఇన్ఫాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్‌ని తెలంగాణ ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ విషయంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందే నగరం హైదరాబాద్. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ఓఅర్ఆర్ నిర్వహణ బాధ్యత ప్రైవేట్ కంపెనీకి కట్టబెట్టారంటూ విమర్శించారు. ఓఅర్ఆర్‌పై ప్రతిఏటా ఆదాయం పెరుగుతుంది తప్పితే తగ్గదు. వస్తున్న ఆదాయానికి తక్కువ చేసి ప్రైవేట్ సంస్థకు ఎందుకు కట్టబెట్టారో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ హక్కు లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

బిడ్‌లో ఎంపికైన కంపెనీ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తే.. బొంబాయి – పునే ఎక్స్‌ప్రెస్ హైవేను నిర్వహిస్తుంది. బేస్ ప్రైజ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అసలు ఓఅర్ఆర్ ప్రాజెక్టును ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు? ముఫ్ఫై సంవత్సరాలు లీజుకు ఎందుకు ఇస్తున్నారో ప్రభుత్వం చెప్పాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. టెండర్ల ప్రక్రియను నామమాత్రంగా చేసి ఐఆర్‌బీ ఇన్ఫాస్ట్రక్చర్ కంపెనీ లిమిటెడ్‌కు కట్టబెట్టారని, ఇందులో పెద్ద కుంభకోణం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని కిషన్‌రెడ్డి అన్నారు.

Karnataka Election: 25 ఏళ్లలో రెండు సార్లే స్పష్టమైన తీర్పునిచ్చిన కన్నడ ఓటర్లు.. ఈసారి జేడీఎస్ ఆశలు ఫలిస్తాయా?

ప్రైవేట్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకమని కేసీఆర్ కుటుంబం గొప్పలు చెప్పింది. కానీ, వేల కోట్ల ప్రభుత్వ ఆదాయాన్ని ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుంది. హెచ్ఎండీఏ మాస్టర్ ప్లాన్‌కు ఇది విరుద్ధం. నమ్మించి గొంతు కోయడంలో కల్వకుంట్ల కుటుంబం అరి తేరిందంటూ కిషన్ రెడ్డి విమర్శించారు. ఓఅర్ఆర్ రాష్ట్ర ప్రభుత్వానికి బంగారు బాతు లాంటిందన్న కిషన్ రెడ్డి.. స్వార్థ ప్రయోజనాలకోసం కేసీఆర్ బంగారు బాతును చంపేశాడని అన్నారు.

Hyderabad ORR Lease: 30ఏళ్లు లీజుకు ఓఆర్ఆర్.. హెచ్ఎండీఏకు భారీగా ఆదాయం..

టెండర్ ప్రక్రియను ఆడిట్ చేపిస్తారా చెప్పాలి? సీబీఐ దర్యాప్తుకు కల్వకుంట్ల కుటుంబం సిద్ధంగా ఉందా? బీజేపీ అధికారంలోకి వచ్చాక దీనిపై పూర్తి విచారణ జరిపిస్తామని కిషన్ రెడ్డి అన్నారు. ఈ కుంభకోణంలో ఎవరెవరి వాటా ఎంతో తెలియాల్సి ఉందని, ఓఅర్అర్‌పై వస్తున్న ఆరోపణలపై ముఖ్యమంత్రి స్పందించకుండా ఎందుకు ముఖం చాటేశారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అనేకమైన భూములు మాయమైపోతున్నాయి. భూములు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేస్తూ… వేల కోట్లు సంపాదించుకున్నారంటూ కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.