Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ హక్కు లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy: విశాఖ స్టీల్ ఫ్లాంట్ తో పాటు సీబీఐపై అవినాశ్ రెడ్డి చేసిన కెమెంట్లపై, అతీక్ అహ్మద్ హత్యపై కిషన్ రెడ్డి స్పందించారు.

Kishan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఆ హక్కు లేదు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy

Kishan Reddy: విశాఖ స్టీల్ ఫ్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే బయ్యారం స్టీల్ ఫ్లాంట్ ను ఏర్పాటు చేస్తోందన్న‌ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. మూతపడిన అనేక పరిశ్రమలను వంద రోజుల్లో తెరిపిస్తామన్న‌ కేసీఆర్ నోరు విప్పాలని అన్నారు. స్టీల్ ఫ్లాంట్ పేరుతో కల్వకుంట్ల కుటుంబం పోజులు కొడుతోందని చెప్పారు.

బయ్యారం ఉక్కు పరిశ్రమపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు ప్రశ్నించాలని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణను గాలికొదిలేసి బీఆర్ఎస్ పేరుతో దేశాన్ని ఉద్దరిస్తాననటం‌ హాస్పాస్పదంగా ఉందని చెప్పారు. కేంద్రాన్ని విమర్శించటమే ఎజెండాగా సీఎం కేసీఆర్ కుటుంబం పెట్టుకుందని అన్నారు. వంద రోజుల్లో నిజాం‌ ఘగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని అన్నారని, తొమ్మిదేళ్లు అవుతున్నా ఎందుకు ఓపెన్ చేయలేదని నిలదీశారు. మూతపడిన పరిశ్రమలను వంద రోజుల్లో తెరిపిస్తామని కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు.

హైదరాబాద్ లో అంబేద్కర్ విగ్రహావిష్కరణపై కిషన్ రెడ్డి మాట్లాడుతూ… సుమారు 9 సంవత్సరాల తరువాత అంబేద్కర్ జయంతి రోజున కేసీఆర్ ఇంటి నుంచి బయటకు వచ్చారని ఎద్దేవా చేశారు. గతంలో ప్రతి ముఖ్యమంత్రి ట్యాంకు బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వచ్చి నివాళి అర్పించే సంప్రదాయం ఉండేదని చెప్పారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఒక్కసారి కూడా రాలేదని అన్నారు.

అంబేద్కర్ రాసిన రాజ్యాంగం రద్దు చేయాలన్నారని, కేసీఆర్ రాజ్యాంగం, కల్వకుంట్ల రాజ్యాంగం రావాలని ఆయన కొట్టుకుంటున్నారని చెప్పారు. బషీర్ బాగ్ బాబు జగ్జీవన్ రావు విగ్రహం వద్దకు కూడా కేసీఆర్ రాలేదని, అంబర్ పేట పూలే విగ్రహం వద్దకూ వెళ్లలేదని విమర్శించారు. తెలంగాణ సమాజం చైతన్యవంతమైందని చెప్పారు. ఇఫ్తార్ వెళ్లేందుకు సమయం ఉన్న కేసీఆర్ కు భద్రాచలం వెళ్లేందుకు సమయం ఉండదని అన్నారు. తెలంగాణను దోచుకున్నది చాలలేదన్నట్లు ఇప్పుడు బీఆర్ఎస్ అంటూ జాతీయ పార్టీ పెట్టారని చెప్పారు.

సీబీఐపై అవినాశ్ రెడ్డి చేసిన కెమెంట్లపై కిషన్ రెడ్డి స్పందించారు. కేసును కొలిక్కి తీసుకువచ్చేందుకు సీబీఐ పని చేస్తోందని అన్నారు. వ్యక్తులు ఎవరైనా సరే చట్టం తనపని తాను చేసుకుంటూ పోతుందని చెప్పారు. అతీక్ అహ్మద్ హత్యపై కిషన్ రెడ్డి స్పందిస్తూ…ఓల్డ్ సిటీలో అనేక బస్తీల నుంచి ఆస్తులు అమ్ముకొని ప్రజలు కట్టు బట్టలతో వచ్చారని, అలాంటి ప్రాంతం గురించి ఒవైసీ మాట్లాడితే బాగుంటుందని అన్నారు. హత్య జరిగిన వెంటనే కమిటీని వేశామని, వందల కేసులు ఉన్న వ్యక్తి చనిపోయాడని.. అలా జరగాల్సింది కాదని, కానీ జరిగిందని చెప్పారు. మాఫియాపై జీరో టోలెరెన్స్ తో వ్యహరిస్తామని అన్నారు.

Vizag Steel Plant: ఈవోఐకు అనూహ్య స్పందన.. భిన్నమైన ప్రతిపాదనతో బిడ్డింగ్‌లో పాల్గొన్న జేడీ లక్ష్మీనారాయణ