Bengal Politics: బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో ఆగని హింస.. బాంబు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు
టీఎంసీ కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడినట్టు ఐఎస్ఎఫ్ ఆరోపించగా, ఐఎస్ఎఫ్‌నే హింసకు దిగినట్టు టీఎంసీ ఆరోపిస్తోంది. నామినేషన్ల పర్వం ప్రారంభమైనప్పటికీ తీవ్ర హింసాత్మక పరిస్థితి ఏర్పడడంతో నామినేషన్ కేంద్రాలకు కిలోమీటర్ పరిధి వరకూ 144 నిషేధాజ్ఞలు విధించాలంటూ జిల్లా మెజిస్ట్రేట్‌లు, పోలీసు కమిషనర్లను రాష్ట్ర ఎన్నికల కమిషన్ గత ఆదివారంనాడు ఆదేశించింది. ఈనెల 15వ తేదీ వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయి.

Panchayat Polls: పశ్చిమబెంగాల్ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రారంభమైన మొదటిరోజునే చెలరేగిన అల్లర్లు ఆగడం లేదు. ఒకవైపు నామినేషన్ల పర్వం, మరొకవైపు అల్లర్లు అన్నట్టుగా కొనసాగుతోంది రాష్ట్రంలో పరిస్థితి. శనివారం మొదలైన ఈ అల్లర్లు నాలుగు రోజులుగా హింసాకాండ కొనసాగింది. రాళ్లు, కర్రలు విసరడం నుంచి బాంబులు విసిరే వరకు వెళ్లింది. మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు జరిపిన బాంబు దాడులతో పోలీసులు, మీడియా సిబ్బంది, ప్రజలు పరుగులు పెట్టారు.
రాష్ట్రంలోని సౌత్ 24 పరగణాల జిల్లా బాంగర్‌లో ఈ బాంబుదాడుల ఘటన చోటుచేసుకుంది. నామినేషన్లు దాఖలు చేయాల్సిన బ్లాక్ డవలప్‌మెంట్ కార్యాలయానికి ఒక కిలోమీటరు దూరంలోనే గుర్తుతెలియని వ్యక్తులు బాంబు దాడులకు పాల్పడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నట్టు ఇండియన్ సెక్యులర్ ఫ్రెంట్ (ఐఎస్ఎఫ్) స్థానిక ఎమ్మెల్యే ఒకరు మంగళవారం ప్రకటించారు. అనంతరం కొద్ది గంటల్లోనే బాంగర్‌లో హింస చెలరేగింది.
AIADMK: జయలలితపై బీజేపీ చీఫ్ చేసిన విమర్శలకు ఘాటుగా స్పందించిన అన్నాడీఎంకే