Allu Arjun : అల్లు అర్జున్ కి 160 ఏళ్ళ పురాతన గిఫ్ట్ ఇచ్చిన మలయాళ వీరాభిమాని

అప్పుడప్పుడు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలకి ప్రేమతో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. తాజాగా అల్లు అర్జున్ కి ఆయన కేరళ అభిమాని ఓ అరుదైన గిఫ్ట్ ని బహూకరించాడు.

Allu Arjun : అల్లు అర్జున్ కి 160 ఏళ్ళ పురాతన గిఫ్ట్ ఇచ్చిన మలయాళ వీరాభిమాని

Allu Arjun

Allu Arjun :  ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగులోనే కాక మలయాళంలో కూడా చాలా మంది అభిమానులు ఉన్నారు. అల్లు అర్జున్ సినిమాలకి మలయాళంలో కూడా బాగా క్రేజ్ ఉంది. అల్లు అర్జున్ ని కేరళలో మల్లు అర్జున్ అని కూడా పిలుచుకుంటారు. అప్పుడప్పుడు ఫ్యాన్స్ తమ అభిమాన హీరోలకి ప్రేమతో గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు. తాజాగా అల్లు అర్జున్ కి ఆయన కేరళ అభిమాని ఓ అరుదైన గిఫ్ట్ ని బహూకరించాడు.

కేరళలో పుట్టి పెరిగి దుబాయ్ లో సెటిలైన మల్టీ మిలియనీర్ రియాజ్ కిల్టన్ ఇటీవల యూఏఈలో అల్లు అర్జున్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అల్లు అర్జున్ కు 160 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన పిస్టల్ ను బహుమానంగా ఇచ్చారు. ఇంత పురాతన అరుదైన గిఫ్ట్ ఇచ్చి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విషయాన్ని తాను సోషల్ మీడియా వేదికగా తెలియచేసాడు. తనకి ఈ గిఫ్ట్ ఇస్తున్నప్పటి వీడియో మరియు ఆ పిస్టల్ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చేసి తన అభిమాన హీరోకి ఇది ఇవ్వటం నాకు చాలా ఆనందంగా ఉందని తెలియచేసాడు ఈ కేరళ అభిమాని రియాజ్.

RRR : బాహుబలి కలెక్షన్స్ పై కన్నేసిన ఆర్ఆర్ఆర్

అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా మొదటి పార్ట్ ని త్వరలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, సాంగ్ తో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అభిమానులు ఈ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తున్నారు.