Farm Laws : ఆ రైతుల ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షలు ఇస్తాం..కేంద్రం రూ. 25 లక్షలు ఇవ్వాలి

మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి చేతులు దులుపు కోవడం కాదని..ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ..

Farm Laws : ఆ రైతుల ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షలు ఇస్తాం..కేంద్రం రూ. 25 లక్షలు ఇవ్వాలి

Kcr Press Meet paddy

Farm Laws Telangana CM KCR : మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసి చేతులు దులుపు కోవడం కాదని..ఆందోళనల్లో చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ..ఆందోళన చేస్తున్న వారిపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ చట్టాలను రద్దు చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఆందోళనలు, పోరాటాలు చేస్తూ…700 నుంచి 750 మంది రైతులు చనిపోయారని తెలిపారు. రైతులు చనిపోవడం బాధాకరమన్నారు. వీరందరికీ సంఘీభావం ప్రకటిస్తున్నట్లు, వారికి నివాళులు అర్పిస్తున్నట్లు వెల్లడించారు.

Read More : Paddy Issue : రేపే ఢిల్లీకి..ధాన్యం కొనుగోళ్ల విషయంలో తేల్చుకుంటాం

ఆ రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రధానిని కోరుతున్నట్లు చెప్పారు. రైతు ఆందోళనల్లో చనిపోయిన కుటుంబాలకు పరిహారం ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందని, ఎంతమంది చనిపోయారో తమకు లెక్కలు చెప్పాలని ఆయా సంఘాలను తాము అడగడం జరుగుతోందన్నారు. ఒక్కో కుటుంబానికి రూ. 3 లక్షలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కేంద్రం కూడా సానుకూలంగా స్పందించాలని,
చనిపోయిన ప్రతి కుటుంబానికి రూ. 25 లక్షలు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేయడం జరుగుతోందన్నారు.

Read More : సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్.. రేపు ఢిల్లీకి వెళ్తున్నా..

పరిహారమే ఇవ్వడమే కాకుండా…రైతు ఉద్యమాల క్రమంలో..వేల వేల కేసులు పెట్టారని, సారీ చెప్పి దులుపుకొంటే కాదన్నారు. వెంటనే కేసులను ఎత్తివేయాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన అమ్మాయిపై దేశ ద్రేహం కేసు పెట్టారని..ఇలా అనేకమందిపై పెట్టారని..వీరందరిపై కేసులను ఎత్తివేయాలని మరోసారి డిమాండ్ చేశారాయన. కనీస మద్దతు ధర చట్టం తీసుకరావాలని..ఈ పోరాటంలో తాము భాగస్వాములవుతామని చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో దీనిపై నిలదీయడం జరుగుతుందన్నారు. మరి సీఎం కేసీఆర్ డిమాండ్స్ పై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందా ? లేదా ? అనేది చూడాలి.