Punjab: సీఎం అంగీకారంతో నిరసన విరమించిన రైతులు

రైతులతో పాటు ప్రభుత్వ, సహకార పంచదార మిల్లుల బకాయిలను సైతం సెప్టెంబర్ 7లోగా చెల్లిస్తామని, ఫగ్వారా షుగర్ మిల్లు మినహా ప్రైవేట్ చక్కెర మిల్లులకు కూడా అదే తేదీలోగా బకాయిలు చెల్లిస్తామని మాన్ హామీ ఇచ్చారు. పగ్వారా షుగర్ మిల్లు రైతులకు 72 కోట్ల రూపాయల బకాయిపడింది. అయితే దానిని వేలం వేస్తే కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చేలా ఉన్నాయి. దీనిపై కూడా ఆలోచిస్తామని మాన్ రైతులకు హామీ ఇచ్చారు.

Punjab: సీఎం అంగీకారంతో నిరసన విరమించిన రైతులు

Bhagwant Mann: రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించుకోవడంతో పాటు చెరకు బకాయిలు చెల్లిస్తామని ముఖ్యమంత్రి భగవంత్ మాన్ హామీ ఇవ్వడంతో ఆగస్టు 3న పిలుపునిచ్చిన నిరసన చేపట్టకూడదని పంజాబ్‭లోని పలు రైతు సంఘాలు నిర్ణయించుకున్నాయి. నాలుగు గంటల పాటు సీఎం మాన్‭తో రైతులు చర్చలు జరిపారు. మంగళవారం సీఎంతో నాలుగు గంటల పాటు చర్చ జరిగింది. ఈ సమావేశంలో రైతుల డిమాండ్లను సీఎం అంగీకరించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్(సిధుపూర్) అధినేత జగ్జిత్ సింగ్ దల్లేవాల్ తెలిపారు. సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘‘నేను రైతుల సంక్షేమం కోసం ఆలోచిస్తాను. నా హయాంలో రైతులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపైకి రానివ్వను. నిజాయితీపరమైన వారి డిమాండ్లను నెరవేర్చడం నా బాధ్యత’’ అని అన్నారు.

195.60 కోట్ల రూపాయల చెరకు బకాయిలు ఉన్నాయని, ఆగస్టు 15 లోపు 100 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని, అనంతరం సెప్టెంబర్ 7 నాటికి మిగిలిన మొత్తం బకాయిని చెల్లిస్తామని సీఎం పేర్కొన్నారు. ‘‘పంట వ్యర్థాలను కాల్చినందుకు, నిరసన చేపట్టినందుకు రైతులపై పెట్టిన ఎఫ్ఐఆర్‭లను రద్దు చేయాలని నిర్ణయించాం’’ అని మాన్ అన్నారు. రైతులతో పాటు ప్రభుత్వ, సహకార పంచదార మిల్లుల బకాయిలను సైతం సెప్టెంబర్ 7లోగా చెల్లిస్తామని, ఫగ్వారా షుగర్ మిల్లు మినహా ప్రైవేట్ చక్కెర మిల్లులకు కూడా అదే తేదీలోగా బకాయిలు చెల్లిస్తామని మాన్ హామీ ఇచ్చారు. పగ్వారా షుగర్ మిల్లు రైతులకు 72 కోట్ల రూపాయల బకాయిపడింది. అయితే దానిని వేలం వేస్తే కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చేలా ఉన్నాయి. దీనిపై కూడా ఆలోచిస్తామని మాన్ రైతులకు హామీ ఇచ్చారు.

Monkeypox: మంకీపాక్స్ వ్యాప్తి నివారణకు ఈ జాగ్రత్తలు పాటించండి.. కేంద్రం కీలక సూచనలు