Manipur : మణిపూర్ లో ఉగ్రవాదుల కాల్పులు..ఐదుగురు పౌరులు మృతి

మణిపూర్ లో ఉగ్రవాదులు కాల్పులకు పాల్పడ్డారు. కాంగ్ పోక్సి జిల్లాలోని బి గమ్నోమ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు.

Manipur : మణిపూర్ లో ఉగ్రవాదుల కాల్పులు..ఐదుగురు పౌరులు మృతి

Manipur

Five civilians killed in a terrorists firing : మణిపూర్ లో ఉగ్రవాదులు పౌరులపై కాల్పులకు పాల్పడ్డారు. కాంగ్ పోక్సి జిల్లాలోని బి గమ్నోమ్ లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు పౌరులు మృతి చెందారు. గ్రామ పెద్ద సహా ఐదుగురు పౌరులు మృతి చెందారు. బీ గమ్నోమ్‌ ప్రాంతంలో కుకీ ఉగ్రవాదులు పౌరులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. దీంతో గ్రామ పెద్ద ఎంపీ ఖుల్లెన్‌, మరో నలుగులు పౌరులు మృతి చెందారు. మృతుల్లో బాలుడు కూడా ఉండటం గమనార్హం.

ఇప్పటివరకు మూడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. ఉగ్రవాదుల కోసం విస్తృతంగా గాలిస్తున్నామని తెలిపారు. కాగా, గత ఆదివారం భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు కుకీ ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో ఇద్దరు ఉగ్రవాదుల అంత్యక్రియలను గ్రామస్థులు నిర్వహిస్తోన్న సమయంలో ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారని స్థానికులు చెబుతున్నారు.

Jammu and Kashmir : జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్..ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతం

మరోవైపు వరుస ఎన్‌కౌంటర్లతో జమ్మూకశ్మీర్‌ అట్టుడుకుతోంది. దక్షిణ కశ్మీర్‌లోని షోపియాన్‌ జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల భద్రతాదళాలకు, ఉగ్రవాదులకు మధ్య నిన్న భీకర కాల్పులు జరిగాయి.

ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. కాగా సోమవారం భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Jammu and Kashmir : జమ్మూకశ్మీర్‌..30 గంటల వ్యవధిలో 5 ఎన్‌కౌంటర్లు

భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్ పన్నిన భారీ కుట్ర భగ్నమైంది. ఉగ్రవాదులను భారత్‌లోకి పాకిస్తాన్‌ పంపుతున్న విషయం మరోసారి బట్టబయలైంది. పాకిస్తాన్‌కు చెందిన టెర్రరిస్టును ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ సెల్‌ పోలీసులు ఆ ముష్కరుడిని అదుపులోకి తీసుకున్నారు.

అతడి నుంచి ఏకే-47తోపాటు హ్యాండ్ గ్రనేడ్స్ స్వాధీనం చేసుకున్నారు. ఐఎస్‌ఐ ఏజెంట్ అయిన ఈ ఉగ్రవాది… ఢిల్లీలో దాడులకు ట్రైనింగ్ తీసుకున్నాడు. ఫేక్‌ డాక్యుమెంట్లతో మనదేశంలోకి ఎంటరయ్యాడు. కానీ.. పోలీసుల అప్రమత్తతతో పెద్ద ముప్పు తప్పింది.

Encounter : ఒడిషాలో ఎన్‌కౌంటర్..ముగ్గురు మావోయిస్టులు మృతి

దేశవ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం పోలీసులు జల్లెడ పడుతున్నారు. జమ్ముకశ్మీర్‌తోపాటు దేశంలోని ప్రధాన నగారాల్లో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదులున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాద సంస్థలపై ఎన్‌ఐఏ ఫోకస్ పెట్టింది. ఢిల్లీ, యూపీ, జమ్ముకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా 18చోట్ల తనిఖీలు చేస్తోంది.