5 States Election Results: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. కీలకాంశాలు

ఐదు రాష్ట్రాల తీర్పు నేడే. ఉత్తరప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు 2024ఎన్నికలకు సంబంధించి సెమీ ఫైనల్స్ ఈ ఫలితాలు. ఇప్పటివరకూ వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం..

5 States Election Results: ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు.. కీలకాంశాలు

5sta

5 States Election Results: ఐదు రాష్ట్రాల తీర్పు నేడే. ఉత్తరప్రదేశ్‌తో పాటు మరికొన్ని రాష్ట్రాలకు 2024ఎన్నికలకు సంబంధించి సెమీ ఫైనల్స్ ఈ ఫలితాలు. ఇప్పటివరకూ వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల ప్రకారం.. యూపీలో బీజేపీ, పంజాబ్ ఆప్, మిగతా మూడు రాష్ట్రాల్లో గట్టి పోటీ కనబరుస్తున్నాయి. ఎనిమిది గంటల నుంచి మొదలుకానున్న ఫలితాల కీలకాంశాలు.


  1. నాలుగు రాష్ట్రాలైన గోవా, మణిపూర్, ఉత్తరాఖాండ్, ఉత్తరప్రదేశ్ లలో అధికారం కోసం బీజేపీ ఎదురుచూస్తుంది. పంజాబ్ లో తిరిగి అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ ఆశాభావం వ్యక్తం చేస్తుంది.

  2. ఉత్తరప్రదేశ్ నుంచి దక్కే 80 పార్లమెంటరీ సీట్స్ దక్కించుకుంటే కేంద్రంలో బలగం పెరుగుతుంది. 403 మంది సభ్యుల అసెంబ్లీలో బీజేపీకి మెజారిటీ వస్తే మూడు దశాబ్దాలకు పైగా వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మొదటి పార్టీగా అవతరిస్తుంది.

  3. అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలో నడుస్తున్న సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఛాలెంజర్‌గా మారింది. చిన్న పార్టీలతో రెయిన్‌బో కూటమిని ఏర్పాటు చేసింది. ఇది రాష్ట్రంలోని తూర్పు, పశ్చిమ ప్రాంతంలో కీలకంగా ఉండే ఇతర వెనుకబడిన తరగతుల ఓటర్లతో తన ముస్లిం-యాదవ్ మద్దతు స్థావరాన్ని భర్తీ చేస్తుందని భావిస్తోంది.

  4. పంజాబ్‌ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్‌ ఫలితాలు అరవింద్ కేజ్రీవాల్‌కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద విజయాన్ని అందించాయి రాష్ట్రంలో ఆప్ ఉనికిని నెలకొల్పేలా కనిపిస్తున్నాయి.

  5. ఎన్నికలకు ముందు ఏడాదికి పైగా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. మాజీ సీఎం అమరీందర్ సింగ్, నవజ్యోత్ సిద్ధూ మధ్య జరిగిన యుద్ధంతో సహా దాని అంతర్గత పోటీలు ఆధిపత్య పోరులో కీలకంగా వ్యవహరించాయి.

  6. అమరీందర్ సింగ్ కొత్త పార్టీ, పంజాబ్ లోక్ కాంగ్రెస్, BJPతో చేతులు కలిపాయి. వ్యవసాయ చట్టాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తడంతో, ఎప్పటి నుంచో BJPతో కలిసి నడుస్తున్న అకాలీదళ్ విడిపోయి బహుముఖ పోటీలో పోటీదారుగా ఏర్పడింది.

  7. గోవాలో ఐదేళ్ల క్రితం బీజేపీకి కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మిత్రపక్షాలను ఏర్పాటు చేసుకునేందుకు రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌తో భాగస్వామ్య పక్షంగా ఉన్న మహారాష్ట్రవాది గోమతక్ పార్టీ మద్దతు తమకు ఉంటుందనే విశ్వాసంలో బీజేపీ కనిపిస్తోంది.

  8. 2017లో 60 సీట్లకు గాను 28 సీట్లు గెలుచుకుని అధికారానికి దూరమైంది కాంగ్రెస్. అయినప్పటికీ సింగిల్ అతిపెద్ద పార్టీగా అవతరించింది కాంగ్రెస్. బీజేపీ 21 సీట్లు గెలుచుకున్నప్పటికీ, నేషనల్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్ సహాయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మేఘాలయా సీఎం కాన్రాడ్ సంగ్మా నేషనల్ పీపుల్స్ పార్టీ కూడా ఈసారి 38 స్థానాల్లో పోటీకి దిగింది.

  9. ఉత్తరాఖాండ్ లో నిలదొక్కుకునేందుకు కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నించింది. గోవా, మణిపూర్ రెండింటికీ దాని అగ్ర నాయకులను పంపి హడావిడి చేసింది. గట్టి పోటీ ఉన్న ఉత్తరాఖండ్‌కు సీనియర్ నేతలను కూడా పంపించారు.

  10. ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన అనేక సర్వేలు ఉత్తరాఖండ్‌లో హంగ్ అసెంబ్లీని అంచనా వేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఇండిపెండెంట్లు, ఆప్, ఎస్‌పీ, బీఎస్‌పి, యూకేడీ వంటి మార్జినల్ ప్లేయర్‌ల పాత్ర గణనీయంగా మారింది. 60 స్థానాలకు గాను 40 నుంచి 45 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌లు నేరుగా పోటీ పడుతుండగా, ప్రాంతీయ పార్టీలు 25-30 స్థానాల్లో త్రిముఖ పోరు సాగించాయి.

Read Also : ఉ.8గంటల నుంచి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ షురూ