MLC Elections : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీ వివాదం

తెలంగాణలోని లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీల రగడ మొదలైంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీ వివాదం కొనసాగుతోంది.

MLC Elections : నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీ వివాదం

Nizamabad

Forgery controversy in Nizamabad : తెలంగాణలోని లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీల రగడ మొదలైంది. అనేకమంది ఇండిపెండెంట్స్ అభ్యర్థులు ఫోర్టరీ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫోర్జరీ వివాదం కొనసాగుతోంది. స్వతంత్ర అభ్యర్థి కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ పై వివాదం ఏర్పడింది.

కోటిగిరి నామినేషన్ ను ప్రతిపాదిస్తూ నామినేషన్ ను సంతకాలు చేసిన ఇద్దరు వ్యక్తులు రివర్స్ అయ్యారు. తమ సంతకాలు ఫోర్జరీ చేశారంటూ ఆరోపిస్తున్నారు. కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ తో తమకు సంబంధం లేదని చెబుతున్నారు.

Tragedy : తండ్రి చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయి నాలుగేళ్ల బాలుడు మృతి

కోటిగిరి శ్రీనివాస్ నామినేషన్ పత్రాలపై నందిపేట ఎంపీటీసీ నవనీత, నిజామాబాద్ 31వ వార్డు డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ గజియా సుల్తానా పేరుతో సంతకాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సంతకాలతో తమకు సంబంధం లేదని ఇద్దరూ చెబుతుండటంతో కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ ప్రశ్నార్థకంగా మారింది.

కోటగిరి శ్రీనివాస్ పై గజియా సుల్తానా రిటర్నింగ్ ఆఫీసర్ కు కంప్లైంట్ చేశారు. దీంతో శ్రీనివాస్ నామినేషన్ ను రిజక్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే నిజామాబాద్ ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన కవిత ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు.