DRDO : రహస్య సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసిన డీఆర్డీఓ ఉద్యోగులు

డీఆర్డీఓలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తూ.. రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు అందిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

DRDO : రహస్య సమాచారాన్ని పాక్ ఏజెంట్లకు చేరవేసిన డీఆర్డీఓ ఉద్యోగులు

Drdo

DRDO : డీఆర్డీఓలో కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగం చేస్తూ.. రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు అందిస్తున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా డీఆర్డీఓ ఇంటిగ్రేటెడ్ రేంజ్ లో పనిచేస్తున్న నలుగురు కాంట్రాక్టు ఉద్యోగులపై అనుమానం రావడంతో అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్రన్‌ రేంజ్‌ ఐజీ హిమాంన్షు కుమర్‌ తెలిపారు. ఇంటిలిజెన్స్ ఏజెన్సీల నుంచి తమకు రహస్య సమాచారం వచ్చిందని తెలిపారు.

Read More : DRDO : రూ.11 వేలకోట్లతో వాయుసేనకు ఆరు నిఘా నేత్రాలు

ఐఎస్డీ నంబర్ల నుంచి ఫోన్లు రావడం గుర్తించి వెంటనే నలుగురు డీఎస్పీలతో కూడిన టీములు ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ టీములు జరిపిన దాడుల్లో నలుగురు ఉద్యోగులు దొరికినట్లు వెల్లడించారు. అనైతికంగా రహస్య సమాచారం అందించి నిధులు పొందుతున్న ఆరోపణపై వీరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.

Read More : Antarvedi Temple : నేటినుంచే.. శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు

వీరివద్ద నేరం చేసినట్లుగా కొన్ని ఆధారాలు దొరికినట్లు ఐజీ హిమాంన్షు కుమర్‌ తెలిపారు. కాగా గతంలో కూడా బాలాసోర్ జిల్లా డీఆర్డీఓలో ఇటువంటి సంఘటనే జరిగింది. బాధ్యతగల పోలీస్ ఉద్యోగంలో ఉన్న వ్యక్తి రహస్య సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేశాడు. కేసుపై విచారణ చేసిన న్యాయస్థానం ఆ కానిస్టేబుల్ కు యావజ్జీవ శిక్ష విధించింది. విచారణలో వీరు నిందితులుగా తేలితే కఠిన శిక్ష పడే అవకాశం ఉంది.