DRDO : రూ.11 వేలకోట్లతో వాయుసేనకు ఆరు నిఘా నేత్రాలు

ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు డీఆర్డీఓకి అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం.. రూ.11 వేల కోట్ల వ్యయంతో దీనిని అభివృద్ధి చేయనుంది డీఆర్డీఓ

DRDO : రూ.11 వేలకోట్లతో వాయుసేనకు ఆరు నిఘా నేత్రాలు

Drdo

DRDO : సరిహద్దు దేశాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు భారత్ ఆందోళన కలిగిస్తున్నాయి. తాలిబన్లు అఫ్ఘాన్ ను ఆక్రమించడం, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుండటం.. చైనా దుందుడుకు వైఖరిని అవలంబిస్తుండటం ఇప్పుడు మన దేశానికి సవాల్ గా మారాయి. ఈ నేపథ్యంలోనే భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేసేందుకు భారత్ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఆకాశ మార్గంలో నిఘాపై దృష్టిపెట్టింది.

శత్రుదుర్బేధ్యంగా దేశాన్ని మార్చేందుకు కేంద్ర రక్షణ శాఖ కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్స్ ను అభివృద్ధి చేసేందుకు డీఆర్డీఓకు అనుమతి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ అభివృద్ధికి ఆమోదముద్ర వేసింది. రూ.11 వేల కోట్ల వ్యయంతో వీటిని అభివృద్ధి చేయనుంది డీఆర్డీఓ.

ఇక వీటిని అమర్చేందుకు ఎయిర్ ఇండియా నుంచి ఏ – 319 లేదా ఏ-321 విమానాలను తీసుకునే అవకాశం ఉంది. ఈ విమానాల్లో మార్పులు చేసి ఎయిర్ బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టంను అమర్చనున్నారు. దీంతోపాటు భారత్ లో అభివృద్ధి చేసిన ఎలెక్ట్రికల్లి స్కాన్డ్ ఆరే రాడార్లను వీటిపై ఉంచే అవకాశం ఉంది. ఇక ఈ వ్యవస్థ నిఘా నేత్రాలవలె పనిచేస్తోంది. ఆకాశంలో ఎగిరే అన్ని వస్తువులను గుర్తిస్తాయి. సముద్రంలో నౌకల కదలికలను ఓ కంట కనిపెడతాయి. దీని ద్వారా సరిహద్దు భద్రతతోపాటు దేశ అంతర్గత భద్రత కూడా పటిష్టం అవుతుంది.