Ganguly vs Kohli: గంగూలీని పట్టించుకోని కోహ్లీ.. కరచాలనం చేయకుండా ముందుకెళ్లిన దాదా .. వీడియో వైరల్

టీమిండియా కెప్టెన్‌గా తనపై వేటు పడటానికి కారణం అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీనేనని విరాట్ భావిస్తూ పరోక్ష విమర్శలు చేశాడు. అప్పటి నుంచి వీరి మధ్య విబేధాలు ఉన్నట్లు ప్రచారంలో ఉంది.

Ganguly vs Kohli: గంగూలీని పట్టించుకోని కోహ్లీ.. కరచాలనం చేయకుండా ముందుకెళ్లిన దాదా .. వీడియో వైరల్

Kohli vs Ganguly

Updated On : April 16, 2023 / 10:58 AM IST

Ganguly vs Kohli: ఐపీఎల్ 2023 (IPL 2023) సీజన్‌లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. కొన్ని మ్యాచ్‌లు చివరి బంతి వరకు గెలిచే జట్టు ఏదో చెప్పలేని పరిస్థితి. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో సొంత మైదానంలో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ  (Virat Kohli) అద్భుత బ్యాటింగ్‌తో ఆఫ్ సెంచరీ చేశాడు. ఆర్సీబీ విజయంతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంకు చేరింది. ఇప్పటి వరకు ఆర్సీబీ నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఐదు మ్యాచ్ లలో ఓడిపోయింది. ఇప్పటి వరకు గెలుపు ఖాతాను తెరవలేక పోయింది. దీంతో పాయింట్ల పట్టికలో డీసీ చివరి స్థానంలో నిలిచింది.

Ipl 2023, RCB vs DC: బెంగ‌ళూరు విజ‌యం.. ఢిల్లీ ఐదో ఓట‌మి

ఆర్సీబీ, డీసీ జట్ల మధ్య మ్యాచ్ అనంతరం ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇరు జట్లు కరచాలనం చేసుకొనే సమయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) ,  సౌరభ్ గంగూలీ (Saurabh Ganguly) మాత్రం కరచాలనం చేసుకోలేదు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో గంగూలీ, కోహ్లీ మధ్య విబేధాలు తారాస్థాయిలో ఉన్నాయంటూ క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Ipl 2023, RCB vs DC: బెంగ‌ళూరు విజ‌యం.. ఢిల్లీ ఐదో ఓట‌మి

మ్యాచ్ అనంతరం విజయంతో మైదానం వీడుతున్న బెంగాల్ జట్టు సభ్యులు, డీసీ సభ్యులు కరచాలనం చేసుకున్నారు. ఈ సమయంలో పాటింగ్ వెనుకాల గంగూలీ ఉన్నాడు. పాటింగ్‌తో కరచాలనం చేసిన విరాట్ కోహ్లీ.. గంగూలీని పట్టించుకోకుండా పాటింగ్ తో మాట్లాడుతున్నాడు. ఈ క్రమంలో గంగూలీ కోహ్లీని దాటుకొని వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావటంతో ఇరువురి మధ్య విబేధాలు మరోసారి బయటపడినట్లయింది.

Brett Lee: ఇండియాలో బ్రెట్ లీ కారును వెంబడించిన యువకులు.. వీడియో షేర్ చేసిన ఆసీస్ మాజీ క్రికెటర్..

టీమిండియా కెప్టెన్‌గా తనపై వేటు పడటానికి కారణం అప్పటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీనేనని విరాట్ భావిస్తూ పరోక్ష విమర్శలు చేశాడు. అప్పటి నుంచి వీరి మధ్య విబేధాలు ఉన్న విషయం విధితమే. తాజా వీడియోతో వారిద్దరి మధ్య విబేధాలు మరోసారి బయటపడినట్లయింది.