Ipl 2023, RCB vs DC: బెంగ‌ళూరు విజ‌యం.. ఢిల్లీ ఐదో ఓట‌మి

ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు 23 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. 175 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

Ipl 2023, RCB vs DC: బెంగ‌ళూరు విజ‌యం.. ఢిల్లీ ఐదో ఓట‌మి

Royal Challengers Bangalore

Ipl 2023, RCB vs DC: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌(Delhi Capitals)తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్(Royal Challengers Bangalore) బెంగ‌ళూరు జ‌ట్టు 23 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. 175 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది. ఢిల్లీ బ్యాట‌ర్ల‌లో మ‌నీశ్ పాండే అర్ధ‌శ‌త‌కంతో ఆకట్టుకోగా, అన్రిచ్ నోర్జే(23 నాటౌట్‌), అక్ష‌ర్ ప‌టేల్‌(21) లు ఫ‌ర్వాలేద‌నిపించారు.

Ipl 2023 RCB vs DC:ఢిల్లీ పై బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

మిగిలిన బ్యాట‌ర్లు విఫ‌లం కావ‌డంతో ఏ ద‌శ‌లోనూ ఢిల్లీ ల‌క్ష్యాన్ని ఛేదించేలా క‌నిపించ‌లేదు. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో విజయ్‌కుమార్ వైశాక్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, మ‌హ్మ‌ద్ సిరాజ్ రెండు వికెట్లు తీశాడు.వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నల్‌లు తలా ఓ ప‌డ‌గొట్టారు. మ‌నీశ్ పాండే ఇన్నింగ్స్ ఓట‌మి అంత‌రాన్ని త‌గ్గించ‌డానికి మాత్ర‌మే ఉప‌యోగ‌ప‌డింది. ఈ సీజ‌న్‌లో ఆర్‌సీబీ రెండో గెలుపును త‌న ఖాతాలో వేసుకోగా ఆడిన ఐదు మ్యాచుల్లోనూ వార్న‌ర్ సేన ఓడిపోడింది. దీంతో ఢిల్లీ క్యాపిట‌ల్స్ త‌న ప్లే అవ‌కాశాలు త‌న‌కు తానుగానే సంక్లిష్టం చేసుకుంటుంది.

Virat Kohli: కావాల‌ని ఎవ‌రూ నెమ్మ‌దిగా ఆడరు.. స్లో స్ట్రైక్‌రేట్‌ విమ‌ర్శ‌ల‌పై విరాట్ కౌంట‌ర్‌

అంత‌క‌ముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. బెంగ‌ళూరు బ్యాట‌ర్ల‌లో విరాట్ కోహ్లి(50; 34 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ‌శ‌త‌కంతో ఆక‌ట్టుకున్నాడు. డుప్లెసిస్‌(22), లోమ్రోర్ (26), మాక్స్‌వెల్‌(24)ల‌కు మంచి ఆరంభాలు ల‌భించినా వాటిని భారీ స్కోర్లుగా మ‌ల‌చ‌డంతో విఫ‌లం అయ్యారు. ఓ ద‌శ‌లో బెంగ‌ళూరు 200 ప‌రుగులు చేస్తుంద‌ని భావించారు. అయితే.. వ‌రుస‌గా మూడు బంతుల్లో ముడు వికెట్లు కోల్పోయి 132/6 గా నిలిచింది. అయితే.. ఆఖ‌ర్లో షాబాజ్ అహ్మద్(20 నాటౌట్‌), అనుజ్ రావ‌త్‌(15 నాటౌట్‌) రాణించడంతో 174 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మిచెల్ మార్ష్‌, కుల్‌దీప్ యాద‌వ్‌లు చెరో రెండు వికెట్లు తీయ‌గా, నోకియా, లలిత్ యాద‌వ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.