Ipl 2023 RCB vs DC:ఢిల్లీ పై బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు 23 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. 175 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది

Ipl 2023 RCB vs DC:ఢిల్లీ పై బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

RCB vs DC

Ipl 2023, RCB vs DC: ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు 23 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది. 175 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 151 ప‌రుగులు చేసింది

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 15 Apr 2023 07:13 PM (IST)

    బెంగ‌ళూరు ఘ‌న విజ‌యం

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు 23 ప‌రుగుల‌తో విజ‌యం సాధించింది

  • 15 Apr 2023 06:49 PM (IST)

    మ‌నీశ్ పాండే ఔట్‌

    ఢిల్లీ జట్టు మ‌రో వికెట్ కోల్పోయింది.. హ‌సరంగ వేసిన 14 ఓవ‌ర్‌లో మ‌నీశ్ పాండే వ‌రుస‌గా 4,6,4 కొట్టాడు. త‌రువాతి బంతికి రెండు ప‌రుగులు తీసి అర్ధ‌శ‌త‌కం పూర్తి చేసుకున్నాడు. అయితే.. ఆఖ‌రి బంతికి ఎల్బీగా ఔట్ అయ్యాడు. 14 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 98/7కి చేరింది. అమన్ హకీమ్ ఖాన్ (1), ల‌లిత్ యాద‌వ్‌(0) ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 06:36 PM (IST)

    ఆరో వికెట్ డౌన్‌

    ఢిల్లీ జ‌ట్టు మ‌రో వికెట్ కోల్పోయింది. విజయ్‌కుమార్ వైశాక్ బౌలింగ్‌లో అక్ష‌ర్ ప‌టేల్ (21) సిరాజ్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఈ ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు రాగా 13 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 82/6కి చేరింది. అమన్ హకీమ్ ఖాన్ 1, మ‌నీశ్ పాండే 34 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 06:32 PM (IST)

    6 ప‌రుగులు

    స‌గం వికెట్లు కోల్పోవ‌డంతో ఢిల్లీ ప‌రుగుల వేగం మంద‌గించింది. హ‌ర్ష‌ల్ ప‌టేల్ వేసిన 12వ ఓవ‌ర్‌లో 6 ప‌రుగులు రావ‌డంతో ఢిల్లీ స్కోరు 76/5కి చేరింది. అక్ష‌ర్ ప‌టేల్ 17, మ‌నీశ్ పాండే 33 ప‌రుగుల‌తో క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 06:19 PM (IST)

    స‌గం వికెట్లు కోల్పోయిన ఢిల్లీ

    బెంగ‌ళూరు బౌల‌ర్ల ధాటికి ఢిల్లీ బ్యాట‌ర్లు పెవిలియ‌న్‌కు క్యూ క‌డుతున్నారు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ వేసిన 8.5 ఓవ‌ర్‌కు అభిషేక్ పొర‌ల్‌(5) పార్నెల్‌కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 53 ప‌రుగుల వ‌ద్ద ఢిల్లీ ఐదో వికెట్ కోల్పోయింది. 9 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 53/5. అక్ష‌ర్ ప‌టేల్‌(0), మ‌నీశ్ పాండే(28) క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 05:59 PM (IST)

    వార్న‌ర్ ఔట్‌

    దూకుడుగా ఆడేందుకు య‌త్నిస్తున్న వార్న‌ర్‌ను విజయ్‌కుమార్ వైశాక్ బుట్ట‌లో వేశాడు. ఆరో ఓవ‌ర్‌లోని నాలుగో బంతికి వార్న‌ర్ షాట్ ఆడ‌గా కోహ్లి చేతికి చిక్కాడు. దీంతో ఢిల్లీ నాలుగో వికెట్ కోల్పోయింది. కాగా.. ఐపీఎల్ విజ‌య్‌కుమార్ ఇదే తొలి వికెట్‌. ఈ ఓవ‌ర్‌లో 7 ప‌రుగులు వ‌చ్చాయి. 6 ఓవ‌ర్ల‌కు ఢిల్లీ స్కోరు 32/4. అభిషేక్ పోరెల్ (1), మ‌నీశ్ పాండే(11) క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 05:54 PM (IST)

    వార్న‌ర్‌.. హ్యాట్రిక్ ఫోర్లు

    ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డిన జ‌ట్టును కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్ ఆదుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు. మ‌హ్మ‌ద్ సిరాజ్ వేసిన ఈ ఓవ‌ర్‌లోని ఆఖ‌రి మూడు బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించాడు. ఈ ఓవ‌ర్‌లో 13 ప‌రుగులు రాగా ఢిల్లీ స్కోరు 25/3. మ‌నీశ్ పాండే(9), డేవిడ్ వార్నర్ (15) క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 05:44 PM (IST)

    మూడు వికెట్లు

    ఢిల్లీ క‌ష్టాల్లో ప‌డింది. ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయింది. సిరాజ్ వేసిన మూడో ఓవ‌ర్ రెండో బంతికి య‌శ్ దుల్ ఎల్బీగా ఔట్ అయ్యాడు. మూడు ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ స్కోరు 4/3. మ‌నీశ్ పాండే(2), డేవిడ్ వార్నర్ (1) క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 05:37 PM (IST)

    రెండో వికెట్ కోల్పోయిన ఢిల్లీ

    175 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఢిల్లీకి బెంగ‌ళూరు బౌల‌ర్లు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. తొలి ఓవ‌ర్‌లో పృథ్వీ షా ర‌నౌట్ కాగా.. రెండో ఓవ‌ర్‌లో మిచెల్ మార్ష్ ఔట్ అయ్యాడు. వేన్ పార్నెల్ బౌలింగ్లో కొహ్లి క్యాచ్ అందుకోవ‌డంతో మార్ష్ ఔట్ అయ్యాడు. రెండు ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఢిల్లీ స్కోరు 2/2. యశ్ ధుల్ 1, డేవిడ్ వార్నర్ (1) క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 05:32 PM (IST)

    పృథ్వీ షా ఔట్‌

    పృథ్వీ షా త‌న పేల‌వ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. ప‌రుగుల ఖాతాను తెర‌వ‌క‌ముందే తొలి ఓవ‌ర్‌లోని నాలుగో బంతికి ర‌నౌట్ అయ్యాడు. తొలి ఓవ‌ర్ ముగిసే స‌రికి ఢిల్లీ స్కోరు 1/1. మిచెల్ మార్ష్ (0), డేవిడ్ వార్నర్ (1) క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 05:10 PM (IST)

    ఢిల్లీ ల‌క్ష్యం 175

    టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్‌సీబీ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో ఆరు వికెట్ల న‌ష్టానికి 174 ప‌రుగులు చేసింది. ఢిల్లీ ముందు 175 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఉంచింది.

  • 15 Apr 2023 05:03 PM (IST)

    8 ప‌రుగులు

    స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో వికెట్లు కోల్పోవ‌డంతో ఆర్‌సీబీ బ్యాట‌ర్లు నెమ్మ‌దిగా ఆడుతున్నారు. అన్రిచ్ నోర్జే వేసిన 18 ఓవ‌ర్‌లో 8 ప‌ర‌గులు వ‌చ్చాయి. 18 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు ఆర్‌సీబీ స్కోరు 154/6. అనుజ్ రావత్ 11, షాబాజ్ అహ్మద్ 7 క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 04:45 PM (IST)

    మూడు బంతుల్లో మూడు వికెట్లు

    బెంగ‌ళూరు జ‌ట్టు మూడు బంతుల్లో మూడు వికెట్ కోల్పోయింది. 14వ ఓవ‌ర్‌ను అక్ష‌ర్ ప‌టేల్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో రెండో బంతిని మాక్స్‌వెల్, ఐదో బంతిని హ‌ర్ష‌ల్ ప‌టేల్ సిక్స్‌లుగా మ‌లిచారు. అయితే.. ఆఖ‌రి బంతికి హ‌ర్ష‌ల్ ప‌టేల్ (6) ఔట్ అయ్యాడు. కాగా.. 15 ఓవ‌ర్‌ను కుల్దీప్ వేశాడు. తొలి బంతికి మాక్స్‌వెల్‌, రెండో బంతికి దినేశ్ కార్తిక్‌ను ఔట్ చేశాడు. దీంతో ఆర్‌సీబీ 6 వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం 15 ఓవ‌ర్ల‌కు ఆర్‌సీబీ స్కోరు 134/6. అనుజ్ రావత్, షాబాజ్ అహ్మద్ క్రీజులో ఉన్నారు.

  • 15 Apr 2023 04:32 PM (IST)

    లోమ్రోర్ ఔట్‌

    13 ఓవ‌ర్లు : ఆర్‌సీబీ జ‌ట్టు మ‌రో వికెట్‌ను కోల్పోయింది. మిచెల్ మార్ష్ వేసిన ఈ ఓవ‌ర్‌లోని రెండో బంతికి సిక్స‌ర్ కొట్టిన లోమ్రోర్(26) ఆ త‌రువాతి బంతికే ఔట్ అయ్యాడు. కీప‌ర్ అభిషేక్ పోరెల్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్ చేరుకున్నాడు. ఈ ఓవ‌ర్‌లో 9 ప‌రుగులు రావ‌డంతో బెంగ‌ళూరు స్కోరు 119/3 కి చేరింది. హర్షల్ పటేల్ 0, గ్లెన్ మాక్స్‌వెల్ 17ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 15 Apr 2023 04:20 PM (IST)

    విరాట్ కోహ్లి ఔట్‌

    11 ఓవ‌ర్లు : దూకుడుగా ఆడుతూ అర్ధ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్న వెంట‌నే విరాట్ పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. ల‌లిత్ యాద‌వ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు య‌త్నించ‌గా బౌండ‌రీ లైన్ వ‌ద్ద యశ్ ధుల్ క్యాచ్ అందుకోవ‌డంతో కోహ్లి(50) ఔట్ అయ్యాడు. ఈ ఓవ‌ర్‌లో గ్లెన్ మాక్స్‌వెల్ రెండు సిక్సులు కొట్ట‌డంతో 14 ప‌రుగులు వ‌చ్చాయి. బెంగ‌ళూరు స్కోరు 103/2. లోమ్రోర్ 15, గ్లెన్ మాక్స్‌వెల్ 13 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 15 Apr 2023 04:14 PM (IST)

    కోహ్లి అర్ధ‌శ‌త‌కం

    10 ఓవ‌ర్లు : ముస్తాఫిజుర్ రెహమాన్ వేసిన ఈ ఓవ‌ర్‌లో తొలి బంతికి ఫోర్ కొట్టిన కోహ్లి నాలుగో బంతిని సిక్స‌ర్‌గా మ‌లిచాడు. ఐదో బంతికి సింగిల్ తీసి 33 బంతుల్లో అర్ధ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. లోమ్రోర్ ఆఖ‌రి బంతికి సిక్స్ కొట్ట‌డంతో ఈ ఓవ‌ర్‌లో మొత్తం 19 ప‌రుగులు వ‌చ్చాయి. బెంగ‌ళూరు స్కోరు 89/1 కి చేరింది. లోమ్రోర్ 15, విరాట్ కోహ్లి 50 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 15 Apr 2023 04:09 PM (IST)

    నిదానించిన ప‌రుగుల వేగం

    9 ఓవ‌ర్లు : బెంగ‌ళూరు కెప్టెన్ డుప్లెసిస్ ఔట్ అయిన త‌రువాత నుంచి ప‌రుగుల వేగం నెమ్మ‌దించింది. కుల్దీప్ యాద‌వ్ వేసిన ఈ ఓవ‌ర్‌లో కోహ్లి ఓ ఫోర్ కొట్టాడు. మొత్తంగా 9 ప‌రుగులు రావ‌డంతో బెంగ‌ళూరు స్కోరు 70/1 కి చేరింది. హిపాల్ లోమ్రోర్ 8, విరాట్ కోహ్లి 38 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 15 Apr 2023 03:57 PM (IST)

    ప‌వ‌ర్ ప్లే

    6 ఓవ‌ర్లు : ల‌లిత్ యాద‌వ్ వేసిన ఈ ఓవ‌ర్‌లో నాలుగు ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. బెంగ‌ళూరు స్కోరు 47/1 కి చేరింది. హిపాల్ లోమ్రోర్ 3, విరాట్ కోహ్లి 21 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 15 Apr 2023 03:53 PM (IST)

    డుప్లెసిస్ ఔట్‌

    5 ఓవ‌ర్లు : బెంగ‌ళూరు జ‌ట్టు మొద‌టి వికెట్‌ను కోల్పోయింది. మిచెల్ మార్ష్ వేసిన ఈ ఓవ‌ర్‌లో తొలి బంతికి కోహ్లి, మూడో బంతికి డుప్లెసిస్ ఫోర్ కొట్టారు. ఈ క్ర‌మంలో దూకుడు ఆడే క్ర‌మంలో అమన్ హకీమ్ ఖాన్ క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు డుప్లెసిస్(22). ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు రాగా బెంగ‌ళూరు స్కోరు 43/1 కి చేరింది. హిపాల్ లోమ్రోర్ 1, విరాట్ కోహ్లి 19 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 15 Apr 2023 03:46 PM (IST)

    డుప్లెసిస్ దూకుడు

    4 ఓవ‌ర్లు : ఫాఫ్ డుప్లెసిస్ క్ర‌మంగా దూకుడు పెంచుతున్నాడు. గ‌త ఓవ‌ర్‌లో రెండు ఫోర్లు కొట్టిన డుప్లెసిస్ అక్ష‌ర్ ప‌టేల్ వేసిన ఈ ఓవ‌ర్‌లో ఓ సిక్స్ కొట్టాడు. మొత్తంగా ఈ ఓవ‌ర్‌లో 7 వ‌చ్చాయి. దీంతో బెంగ‌ళూరు స్కోరు 33/0 కి చేరింది. ఫాఫ్ డుప్లెసిస్ 18, విరాట్ కోహ్లి 14 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 15 Apr 2023 03:43 PM (IST)

    డుప్లెసిస్ రెండు ఫోర్లు

    3 ఓవ‌ర్లు : తొలి ఓవ‌ర్‌లో కోహ్లి రెండు ఫోర్లు కొడితే ముస్తాఫిజుర్ రెహమాన్ వేసిన ఈ ఓవ‌ర్‌లో ఫాఫ్ డుప్లెసిస్ రెండు, మూడు బంతుల‌ను ఫోర్లుగా మ‌లిచాడు. ఈ ఓవ‌ర్‌లో 10 ప‌రుగులు వ‌చ్చాయి. బెంగ‌ళూరు స్కోరు 26/0. ఫాఫ్ డుప్లెసిస్ 12, విరాట్ కోహ్లి 13 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 15 Apr 2023 03:40 PM (IST)

    5 ప‌రుగులు

    2 ఓవ‌ర్ : అక్ష‌ర్ ప‌టేల్ వేసిన ఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు మాత్ర‌మే వ‌చ్చాయి. బెంగ‌ళూరు స్కోరు 16/0. ఫాఫ్ డుప్లెసిస్ 3, విరాట్ కోహ్లి 12 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 15 Apr 2023 03:35 PM (IST)

    మొద‌టి ఓవ‌ర్‌లో రెండు ఫోర్లు కొట్టిన కోహ్లి

    టాస్ ఓడిన‌ బెంగ‌ళూరు జ‌ట్టు బ్యాటింగ్ ఆరంభించింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్‌, విరాట్ కోహ్లి లు ఓపెన‌ర్లుగా గ్రౌండ్‌లోకి అడుగుపెట్టారు. తొలి ఓవ‌ర్ ను ఢిల్లీ బౌల‌ర్‌ అన్రిచ్ నోర్జే వేశాడు. ఈ ఓవ‌ర్‌లో విరాట్ కోహ్లీ రెండు, మూడు బంతుల‌ను ఫోర్లుగా మ‌లిచాడు. మొద‌టి ఓవ‌ర్ ముగిసే స‌రికి బెంగ‌ళూరు స్కోరు 11/0. ఫాఫ్ డుప్లెసిస్ 1, విరాట్ కోహ్లి 9 ప‌రుగుల‌తో ఉన్నారు.

  • 15 Apr 2023 03:11 PM (IST)

    ఢిల్లీ క్యాపిటల్స్ తుది జ‌ట్టు

    డేవిడ్ వార్నర్ (కెప్టెన్‌), మిచెల్ మార్ష్, యశ్ ధుల్, మనీష్ పాండే, అక్షర్ పటేల్, అమన్ హకీమ్ ఖాన్, లలిత్ యాదవ్, అభిషేక్ పోరెల్ (వికెట్ కీప‌ర్‌), కుల్దీప్ యాదవ్, అన్రిచ్ నోర్జే, ముస్తాఫిజుర్ రెహమాన్

  • 15 Apr 2023 03:08 PM (IST)

    రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుది జ‌ట్టు

    విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్‌), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (వికెట్ కీప‌ర్‌), వనిందు హసరంగా, హర్షల్ పటేల్, వేన్ పార్నెల్, మహ్మద్ సిరాజ్, విజయ్‌కుమార్ వైషాక్

  • 15 Apr 2023 03:04 PM (IST)

    టాస్ గెలిచిన ఢిల్లీ

    ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(IPL)2023లో భాగంగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ జ‌ట్టు కెప్టెన్ వార్న‌ర్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రెండో ఇన్సింగ్స్‌లో మంచు ప్ర‌భావం చూపిస్తుంద‌న్న కార‌ణంతోనే బౌలింగ్ తీసుకున్న‌ట్లు తెలిపాడు.