OTT Release: గెట్ రెడీ.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ బిగ్ మూవీస్!

యేటర్లే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల పండగ స్టార్టయ్యింది. ఒకవైపు సిల్వర్ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ లాంటి భారీ క్రేజీ సినిమాలు రాబోతున్నా.. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన..

OTT Release: గెట్ రెడీ.. ఓటీటీలో బ్లాక్ బస్టర్ బిగ్ మూవీస్!

Ott Release

OTT Release: ధియేటర్లే కాదు ఓటీటీల్లో కూడా పెద్ద సినిమాల పండగ స్టార్టయ్యింది. ఒకవైపు సిల్వర్ స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ లాంటి భారీ క్రేజీ సినిమాలు రాబోతున్నా.. బిగ్ స్క్రీన్ లో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు ఓటీటీలోకి రాబోతున్నాయి. ఏదో అల్లా టప్పా చిన్న సినిమాలు కాదు.. భీమ్లానాయక్,వలిమై లాంటి బ్లాక్ బస్టర్ బిగ్ మూవీస్ ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చెయ్యడానికి రెడీ అవుతున్నాయి. మరి ఏ సినిమా ఎప్పుడు ఏ ఓటీటీలోకి రాబోతోందో డీటెయిల్డ్ గా చూద్దాం.

OTT Releases: అదిరే ఆఫర్స్.. ఓటీటీ బాటలో మినిమం బడ్జెట్ మూవీస్!

పవర్‌ స్టార్ పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో ఫిబ్రవరి 25న విడుదలైన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఈ మూవీకి సాగర్ కె. చంద్ర దర్శకత్వం వహించగా స్క్రీన్‌ ప్లే, సంభాషణలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రాశారు. థియేటర్లలో అలరించిన ఈ సినిమా ప్రముఖ ఓటీటీ సంస్థలు ఆహా, డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లలో మార్చి 25 నుంచి ‘భీమ్లా నాయక్‌’ స్ట్రీమింగ్‌ కానుంది. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కథానాయకుడిగా ఫిబ్రవరి 24న రిలీజైన మూవీ ‘వలిమై’. హెచ్. వినోద్‌ తెరకెక్కించిన ఈ సినిమాలో టాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తికేయ విలన్‌గా నటించి మెప్పించాడు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా హిట్‌ కొట్టన ‘వలిమై’ కూడా మార్చి 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదికా ‘జీ5’లో ప్రదర్శితం కానుంది.

OTT Release: కంటెంట్ ఉంటే చాలు.. కనెక్ట్ అయిపోతున్న ఆడియన్స్!

ఇక పారలెల్స్‌ (ఒరిజినల్‌ మూవీ) మార్చి 23వ తేదీ నుంచి డిస్నీ+హాట్‌ స్టార్‌ లో స్ట్రీమింగ్‌ కానుండగా.. డ్యూన్ (హాలీవుడ్‌) మార్చి 25వ తేదీ నుంచి అమెజాన్‌ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ కానుంది. బ్రిడ్డిటన్‌ (వెబ్‌సిరీస్‌2) మార్చి 25వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌ లో స్ట్రీమింగ్‌ కానుండగా.. రుహానియత్‌ (హిందీ) మార్చి 23వ తేదీ నుంచి ఎంఎక్స్‌ ప్లేయర్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది. హలో (వెబ్‌సెరిస్‌) మార్చి 23వ తేదీ నుంచి ఊట్‌ లో స్ట్రీమింగ్‌ కానుంది.