Varun Tej : బాబాయ్ ‘తమ్ముడు’ సినిమా చూసి ఫిక్స్ అయ్యాను..
''నేను చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ బాబాయి నటించిన తమ్ముడు చిత్రం చాలా సార్లు చూశాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అప్పట్లోనే అలాంటి సినిమా చేయాలి అనుకునే వాడ్ని.......

Varun
Ghani : వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా గని. ఈ చిత్రం ఏప్రిల్ 8న రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా వైజాగ్ లో గని ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి బన్నీ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. దీంతో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా ఈ కార్యక్రమానికి అతిధిగా వచ్చారు.
గని సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ”అందరూ ఉగాది పండుగను ఇంట్లో వాళ్లతో జరుపుకుంటారు. కానీ ఇవాళ నేను ఇక్కడ అభిమానులతో జరుపుకుంటున్నాను. దర్శకుడు కిరణ్ గత ఐదేళ్లుగా నాకు తెలుసు, ఈ సినిమాకు అతడ్ని దర్శకుడిగా ఎంపిక చేసుకుని సరైన నిర్ణయం తీసుకున్నానని భావిస్తున్నాను. ఈ సినిమాలో నేను ప్రాణం పెట్టి చేశాను, నా కంటే దర్శకుడు కిరణ్, ఇతర టెక్నీషియన్లు, నిర్మాతలు ఎంతో తపన చూపించారు.”
Vaishnav Tej: ‘ఖుషి’ని చూపిస్తున్న వైష్ణవ్ తేజ్..?
”నేను చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ బాబాయి నటించిన తమ్ముడు చిత్రం చాలా సార్లు చూశాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం. అప్పట్లోనే అలాంటి సినిమా చేయాలి అనుకునే వాడ్ని. తమ్ముడు చిత్రం స్ఫూర్తితోనే నేను, దర్శకుడు కిరణ్ ఎంతో చర్చించుకుని ఈ సినిమా చేశాము. ఈ ఫంక్షన్ కు వస్తుంటే దార్లో చిరంజీవి గారు ఫోన్ చేశారు. ఫంక్షన్ కు బన్నీ వస్తున్నాడు, జాగ్రత్తగా చేసుకోండి అని చెప్పారు. రామ్ చరణ్ కు కృతజ్ఞతలు చెప్పాలి. ఈ సినిమాలో నా లుక్ కు అవసరమైన వర్క్ కోసం ఓ ట్రైనర్ ను రామ్ చరణ్ పంపించాడు” అని తెలిపారు.