Vaishnav Tej: ‘ఖుషి’ని చూపిస్తున్న వైష్ణవ్ తేజ్..?

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద తొలిసినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు....

Vaishnav Tej: ‘ఖుషి’ని చూపిస్తున్న వైష్ణవ్ తేజ్..?

Vaishnav Tej To Come Up With Khushi Storyline

Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వద్ద తొలిసినిమాతోనే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించగా, ఈ మూవీ ఔట్ అండ్ ఔట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చింది. ఇక ఈ సినిమాలో అందాల భామ కృతి శెట్టి హీరోయిన్‌గా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఇక వైష్ణవ్ తేజ్ రెండో సినిమా కొండపొలంతో ప్రేక్షకుల ముందుకు రాగా, అది బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

Vaishnav Tej: కొత్త సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసిన ఉప్పెన హీరో!

కాగా తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే రిలీజ్‌కు రెడీ చేశాడు ఈ హీరో. ‘రంగరంగ వైభవంగా’ అనే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు వైష్ణవ్ తేజ్. అయితే ఈ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ఎవర్‌గ్రీన్ మూవీ ‘ఖుషి’ని తలపించే విధంగా ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఖుషి సినిమా స్టోరీలైన్ మనకు కనిపిస్తుందట. రంగరంగ వైభవంగా చిత్రంలో హీరో ఓ మెడికల్ స్టూడెంట్‌గా కనిపిస్తాడట. అయితే హీరోయిన్‌తో అతడికి ఏర్పడే మనస్పర్థల కారణంగా వారు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారనేది ఈ సినిమా కథగా ఉంటుందని చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Vaishnav Tej : యాక్టర్‌గా ఫెయిల్ అయితే.. అప్పుడు ఆ పనులు చేసుకుంటా

ఈగో అనే పాయింట్‌పై ఈ సినిమా కథ ఉండనుండటంతో ఖుషి సినిమా చూస్తున్నట్లే మనకు అనిపిస్తుందని చిత్ర యూనిట్ అంటోంది. అయితే కేవలం ఈ పాయింట్ వరకు మాత్రమే మనకు ఖుషి సినిమా గుర్తుకు వస్తుందని, ఆ తరువాత ఈ సినిమా కథ చాలా కొత్తగా ఉండబోతుందని వారు అంటున్నారు. మరి వైష్ణవ్ తేజ్ నిజంగానే ఖుషి సినిమా స్టోరీలైన్‌తో వస్తున్నాడా లేక ఇదంతా కేవలం పుకారేనా అనేది తెలియాలంటే రంగరంగ వైభవంగా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.