Vaishnav Tej: కొత్త సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసిన ఉప్పెన హీరో!

‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మరో మెగాహీరో వైష్ణవ్ తేజ్.. తన తొలి సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా.....

Vaishnav Tej: కొత్త సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసిన ఉప్పెన హీరో!

Vaishnav Tej Rangaranga Vaibhavamga Locks Release Date

Vaishnav Tej: ‘ఉప్పెన’ చిత్రంతో టాలీవుడ్‌లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన మరో మెగాహీరో వైష్ణవ్ తేజ్.. తన తొలి సినిమాతో అదిరిపోయే సక్సెస్‌ను అందుకున్నాడు. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించగా, ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడ్డాయి. ఇక ఈ సినిమా తరువాత దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన ‘కొండపొలం’ సినిమాలో నటించి మెప్పించాడు ఈ యంగ్ హీరో. కానీ ఆ సినిమా అనుకున్న మేర కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు.

Vaishnav Tej : సమ్మర్‌కి గ్రాండ్ ముగింపు ఇవ్వనున్న వైష్ణవ్ తేజ్.. ‘రంగరంగ వైభవంగా’ రిలీజ్ డేట్ ఫిక్స్

దీంతో ఇప్పుడు తన నెక్ట్స్ చిత్రాన్ని ఎలాగైనా హిట్ చేయాలనే కసితో వైష్ణవ్ తేజ్ ఉన్నాడు. ఈ క్రమంలోనే తన తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ షూటింగ్‌ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా చిత్ర యూనిట్ ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను రివీల్ చేసింది. ఈ సినిమాను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను తమిళ దర్శకుడు గిరీశాయ తెరకెక్కిస్తుండగా, ఇందులో కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది.

Vaishnav Tej Ranga Ranga Vaibhavamga

ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరికొత్త లుక్‌లో ప్రేక్షకులను అలరిస్తాడు. ఇక ఈ సినిమా పోస్టర్స్, టీజర్లు ఇప్పటికే ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. కాగా ఈ సినిమాను బివిఎస్ఎన్.ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఇండస్ట్రీ వర్గాల్లోనూ ఈ చిత్రంపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మరి ‘రంగ రంగ వైభవంగా’ చిత్రంతో వైష్ణవ్ తేజ్ ఉప్పెన లాంటి సక్సెస్ అందుకుంటాడా లేదా అనేది తెలియాలంటే జూలై 1 వరకు వెయిట్ చేయాల్సిందే.