Gold Rate Today: మహిళలకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఎంతంటే?
వెండి ధరలు భారీగా తగ్గుకుంటూ వస్తున్నాయి. భాగ్యనగరంలో ఈరోజు వెండి ఏకంగా రూ. వెయ్యి తగ్గింది. రెండు రోజుల్లో కిలో వెండి ధర రూ.1200 మేర తగ్గిపోయింది.

Gold Rate
Gold Rate Today: శుభ కార్యాల సీజన్ ప్రారంభంకాబోతోంది. మరో వారం రోజుల్లో శుభ ముహూర్తాలు మొదలవుతాయి. దీంతో బంగారం (Gold), వెండి (Silver) ఆభరణాల కొనుగోళ్లు పుంజుకోనున్నాయి. ఇలాంటి తరుణంలో మహిళలకు అదిరిపోయే శుభవార్త. బంగారం ధరలు దిగివస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ (International market) లో పసిడి రేటు నేల చూపులు చూడటం వల్ల ఆ ప్రభావం దేశీ మార్కెట్‌లపై కూడా పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

Gold
Gold Idli : 24 క్యారెట్ల బంగారంతో చేసిన ఇడ్లీ .. ధర ఎంతో తెలుసా..?
హైదరాబాద్‌లో బంగారం ధర స్వల్పంగా తగ్గింది . ఈ నెల ప్రారంభంలో పది గ్రాములకు రూ.60,380 వద్ద ఉన్న బంగారం.. క్రమం తగ్గుకుంటూ వస్తోంది. హైదరాబాద్‌లో ఈ రోజు ధరలను పరిశీలిస్తే.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,060గా ఉంది. అదేవిధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,050 గా ఉంది. నిన్నటితో పోలిస్తే 10 గ్రాముల ధరపై రూ. 100 మేర బంగారం ధరలు తగ్గాయి. రాబోయే కాలంలో పెళ్లిళ్లు, పండుగల సీజన్ కావటంతో మరోసారి బంగారం ధరలు పెరిగే అవకాశాలు లేకపోలేదు. ఇక దేశ రాజధానిలోనూ బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం 24 క్యారెట్ల స్వచ్ఛమైన గోల్డ్ ధర ఈరోజు 60,210గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,200 పలుకుతోంది.

Gold
Gold Storage Limit at Home : మీ ఇంట్లో ఎంత బంగారం దాచుకోవచ్చునో తెలుసా?
మరోవైపు వెండి ధరలు భారీగా తగ్గుకుంటూ వస్తున్నాయి. భాగ్యనగరంలో ఈరోజు వెండి ఏకంగా రూ. వెయ్యి తగ్గింది. రెండు రోజుల్లో కిలో వెండి ధర రూ.1200 మేర తగ్గిపోయింది. హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండి రేటు రూ. వెయ్యి తగ్గి రూ. 77,300 పడిపోయింది. వెండి ధరసైతం బంగారంతో పాటు వరుసగా దిగివస్తుంది. దేశ రాజధానిలోనూ వెండి ధర స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 75,100 ఉంది.