Gold-Silver Prices : స్థిరంగా బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి..!

Gold-Silver Prices : బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రెండురోజులుగా అదే ధరతో కొనసాగుతున్నాయి.

Gold-Silver Prices : స్థిరంగా బంగారం ధరలు.. భారీగా తగ్గిన వెండి..!

Gold Silver Prices Gold And Silver Prices Today All Around Country States (1)

Gold-Silver Prices : బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు రెండురోజులుగా అదే ధరతో కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.47,800 స్థిరంగా ఉంది. నగరంలో గ్రాము బంగారం ధర రూ.4,780గా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర రూ.52,140 వద్ద స్థిరంగా ఉంది. హైదరాబాద్‌లో ఒక్క గ్రాము ప్యూర్ గోల్డ్ రేటు రూ.5,214కి చేరింది. హైదరాబాద్, విశాఖపట్టణం, విజయవాడతో పాటు బెంగళూరు, కోల్‌కతా, ముంబై, ఢిల్లీలో బంగారం ధరలు ఒకే ధరతో కొనసాగుతున్నాయి. 22 క్యారట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.47,800 స్థిరంగా కొనసాగుతోంది. 24 క్యారట్ల స్వచ్ఛమైన బంగారం రూ.52,140కి చేరింది.

మరోవైపు ఇతర ప్రధాన నగరాలైన చెన్నైలో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు రూ.52,820 పలుకుతోంది. రెండు రోజులుగా బంగారం స్థిరంగా కొనసాగుతోంది. గత పది రోజుల్లో బంగారం రేటు 5 సార్లు తగ్గింది. మరో 2 సార్లు పెరిగింది. మరో 3 సార్లు స్థిరంగా కొనసాగింది. బంగారం ఇప్పట్లో పెరిగే అవకాశం లేదని భావించినప్పుడే బంగారం కొనేందుకు సరైన సమయమని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పట్లో బంగారం ధర పెరిగే అవకాశం లేదని భావించిన సమయంలోనే బంగారాన్ని కొనుగోళ్లు చేయడం మంచిదని సూచిస్తున్నారు.

Gold Silver Prices Gold And Silver Prices Today All Around Country States

Gold Silver Prices Gold And Silver Prices Today All Around Country States

ఒకవైపు బంగారం ధరలు తగ్గిన తర్వాత రెండు రోజులుగా స్థిరంగా కొనసాగతున్నాయి. అయితే వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో కిలో వెండి ధర రూ. రూ.70,700కి తగ్గింది. బుధవారంతో పోల్చితే రూ.300 వరకు వెండి దిగొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో 10 గ్రాముల వెండి ధర రూ.707 చేరింది. హైదరాబాద్‌ సహా విజయవాడ, విశాఖపట్టణం, కేరళలో చెన్నై, బెంగళూరులో కిలో వెండి రూ.70,700కి తగ్గింది. ప్రధాన నగరాలైన ముంబై, న్యూఢిల్లీ, కోల్‌కతా, పూణె, జైపూర్, లక్నోల్లో రూ.66,200కి తగ్గిపోయింది. గత 10 రోజుల్లో వెండి ధరలు 6 సార్లు తగ్గాయి. ప్లాటినం ధర తులం ధర రూ.220 క్షీణించింది. ఈ రేటు రూ.23,730కు భారీగా తగ్గిపోయింది. రూ.51,200 దిగువకు బంగారం రేటు తగ్గితే విక్రయించుకోవచ్చని నిపుణులు అంటున్నారు. రూ. 50,800 స్థాయికి రేటు పడే అవకాశం ఉందని అంచనా వేశారు.

Read Also :  Gold Rate: భారీగా పెరిగిన బంగారం ధరలు.. కారణం ఇదే!