Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!

ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో ఒకటైన క్రాస్-ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ Hangouts షట్ డౌన్ చేసేస్తోంది.

Google Hangouts : వచ్చే నవంబర్‌లో హ్యాంగౌట్స్ షట్‌డౌన్.. గూగుల్ చాట్‌కు మారిపోండి..!

Google To Shut Down Hangouts In November, Asks Users To Move To Google Chat (1)

Google Hangouts : ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ అందించే సర్వీసుల్లో ఒకటైన క్రాస్-ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ సర్వీస్ Hangouts తొమ్మిదేళ్ల తర్వాత షట్ డౌన్ చేస్తోంది. అక్టోబర్ 2022లోగా Google Chatకి మారిపోవాలని హ్యాంగౌట్స్ యూజర్లను టెక్ దిగ్గజం కోరుతోంది. Google Hangouts మొబైల్ యూజర్లకు Gmail లేదా Chat యాప్‌లో Google Chat మారమని కోరుతూ యాప్‌లో మెసేజ్‌లను పంపుతోంది. అదనంగా, Hangouts Chrome ఎక్స్‌టెన్షన్‌ని ఉపయోగించే యూజర్లు కూడా Webలో Chatకి మారిపోవాలి లేదా Chat వెబ్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలని కోరుతోంది.

వెబ్‌లో Gmailలో Hangoutsని ఉపయోగించే వ్యక్తులు వచ్చే నెలలో Gmailలోని Google Chatకి అప్‌గ్రేడ్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే.. Google పాత సర్వీసుల్లో ఒకటైన Hangouts సర్వీసులు ఈ ఏడాది నవంబర్‌లో నిలిచిపోనున్నాయి. అంతకంటే ముందే యూజర్లు తమ మొత్తం డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలని Google కోరుతోంది. చాలా మంది యూజర్ల చాటింగ్, Hangouts నుంచి గూగుల్ చాట్‌కి మారిపోతాయని కంపెనీ తెలిపింది. నవంబర్‌లో Hangouts నిలిపివేసిన తర్వాత యూజర్లు తమ డేటాను డౌన్‌లోడ్ చేయడానికి Google Takeoutని ఉపయోగించాల్సి ఉంటుంది.Google To Shut Down Hangouts In November, Asks Users To Move To Google Chat (2)

Google To Shut Down Hangouts In November, Asks Users To Move To Google Chatఅప్పుడు Hangouts డేటా కాపీ చేసుకోవాలని గూగుల్ వినియోగదారులకు సూచిస్తోంది. ఈ ఏడాది చివరి వరకు వెబ్‌లో హ్యాంగ్‌అవుట్‌లు అందుబాటులో ఉంటాయని గూగుల్ వెల్లడించింది. గూగుల్ చాట్‌కు మారమని గూగుల్ యూజర్లను ప్రోత్సహిస్తోంది. అయితే వెబ్‌లో Hangouts ఈ ఏడాది చివరి వరకు అందుబాటులో ఉంటాయి. వెబ్‌లోని Hangouts వెబ్‌లో గూగుల్ చాట్‌కి మారిపోవడానికి కనీసం ఒక నెల ముందు యూజర్లు ఇన్‌-ప్రొడక్ట్ నోటీసును చూస్తారని టెక్ దిగ్గజం అధికారిక బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Google Chat అనేది Hangouts కు అడ్వాన్స్ వెర్షన్. డాక్స్, స్లయిడ్‌లు లేదా షీట్‌లను ఎడిట్ చేయడం వంటి కొత్త ఫీచర్లను అందిస్తుంది. ఇందులో స్పేస్‌లు కూడా ఉన్నాయి. టాపిక్-ఆధారంగా ఎంచుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం చాట్‌లు, గ్రూపుల్లో యూజర్లు తమ విషయాలను షేర్ చేసుకోవచ్చు. డాక్యుమెంట్ల విషయానికి వస్తే.. ఫైల్‌లు, టాస్క్‌లను ఒకే స్థానం నుంచి నిర్వహించుకోవచ్చు. రాబోయే నెలల్లో లైవ్ కాలింగ్, Spacesలో ఇన్-లైన్ థ్రెడింగ్ మల్టీ ఫిక్సర్ పార్టనర్‌షిప్ వ్యూ సామర్థ్యం వంటి మరిన్ని ఫీచర్లను చూడవచ్చునని Google బ్లాగ్ పోస్ట్‌లో పేర్కొంది.

Read Also : Google Co-Founder: బిల్‌గెట్స్, జెఫ్ బెజోస్ బాటలో సెర్జీబ్రిన్ దంపతులు.. ఏం చేస్తున్నారంటే..