Groundnut Varieties : ఉత్తర కోస్తాకు అనువైన వేరుశనగ రకాలు.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు

ఖరీఫ్ లో వర్షాధారంగా  వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో వుంది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తర కోస్తా  ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు.  ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం.

Groundnut Varieties : ఉత్తర కోస్తాకు అనువైన వేరుశనగ రకాలు.. అధిక దిగుబడులకోసం శాస్త్రవేత్తల సూచనలు

Groundnut Varieties

Groundnut Varieties : నూనెగింజల పంటల్లో ప్రధానమైన పంట వేరుశనగ. తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగుచేస్తూ ఉంటారు రైతులు.  ప్రాంతాన్నిబట్టి, ఆయా వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఖరీఫ్ వేరుశనగను జూన్ నుండి ఆగష్టు వరకు సాగుచేస్తారు.

READ ALSO : Paddy Nursery : ఖరీఫ్ వరినారుమడులను పోస్తున్న రైతులు.. నాణ్యమైన నారు కోసం చేపట్టాల్సిన మెళకువలు

ముఖ్యంగా ఉత్తరకోస్తా జిల్లాల్లో తేలిక నేలల్లో జూన్ నెలలో వేరుశనగను విత్తుతారు. పాత రకాల స్థానంలో ప్రస్థుతం అధిక దిగుబడినిచ్చే అనేక నూతన రకాలు అందుబాటులో వున్నాయి. వీటి గుణగణాలు, సాగులో పాటించాల్సిన మెళకువల గురించి విశాఖ జిల్లా, కొండెంపుడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా.గౌరి రైతాంగానికి తెలియజేస్తున్నారు.

READ ALSO : Managed Cow Dairy : పశువులపై ఉన్నమమకారంతో ఆవుల డెయిరీ నిర్వహిస్తున్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్

ఖరీఫ్ లో వర్షాధారంగా  వేరుశనగ పంట అధిక విస్తీర్ణంలో సాగులో వుంది. తెలంగాణతోపాటు, ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ఉత్తర కోస్తా  ప్రాంతాలలో ఎక్కువగా సాగు చేస్తారు.  ముఖ్యంగా ఈ పంటకు ఇసుక గరప నేలలు ఉండి , కొద్ది పాటి నీటివసతి ఉన్న ప్రాంతాలు అనుకూలం. ఉత్తరకోస్తా జిల్లాల్లో సాగులోవున్న ప్రధాన నూనెగింజల పంట వేరు శనగ అని చెప్పవచ్చు. అయితే ఇక్కడి రైతులు ఇంకా పాత రకాలనే సాగు చేయటం వల్ల ఆశించిన ఫలితాలు సాధించలేకపోతున్నారు.

READ ALSO : Prawn Cultivation : పడిపోతున్న ధరలు, చుక్కలనంటుతున్న ఉత్పత్తి వ్యయం.. రొయ్యరైతు విలవిల

దీనికితోడు తరచూ తుఫాన్ల బెడద వల్ల దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ నేపధ్యంలో ఖరీఫ్ వేరుశనగలో  అధిక దిగుబడిని పొందాలంటే, రకాల ఎంపిక మొదలు పంట నూర్పిడి వరకు, ఎప్పటికప్పుడు తగిన యాజమాన్య, సస్యరక్షణ చర్యలు చేపట్టినట్లయితే నాణ్యమైన, అధిక దిగుబడులు పొందే అవకాశం ఉందంటున్నారు విశాఖ జిల్లా, కొండెంపుడి కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డా.గౌరి .

READ ALSO : Guava Plantation : పెరిగిన జామతోటల విస్తీర్ణం.. తగ్గిన లాభాలు

భూసార పరీక్షలను అనుసరించి ఎరువుల మోతాదును నిర్ణయించుకోవాలి. ముఖ్యంగా  వర్షాకాలంలో ఎరువులను అతిగా వాడొద్దు. సిఫార్సు మేరకే సరైన సమయంలో వేయాలి. ఇటు సూక్ష్మపోషక లోపాలను ఎప్పటికప్పుడు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా నాణ్యమైన దిగుబడులను పొందేందుకు అవకాశం ఉంటుంది.