Tollywood Star’s: తెలుగు హీరోలలో పెరుగుతున్న ‘మా.. మేము’ సెంటిమెంట్!

నా, నేను అన్నది పోయి కొవిడ్ తో.. మా, మేము అన్న సెంటిమెంట్స్ బాగా పెరిగాయి. ఇప్పుడు తెలుగు సినిమా గెలవాలన్నదే టాలీవుడ్ స్టార్స్ లక్ష్యం. ఒక్క సినిమా అని కాకుండా అందరి ప్రాజెక్ట్స్..

Tollywood Star’s: తెలుగు హీరోలలో పెరుగుతున్న ‘మా.. మేము’ సెంటిమెంట్!

Tollywood Star's

Tollywood Star’s: నా, నేను అన్నది పోయి కొవిడ్ తో.. మా, మేము అన్న సెంటిమెంట్స్ బాగా పెరిగాయి. ఇప్పుడు తెలుగు సినిమా గెలవాలన్నదే టాలీవుడ్ స్టార్స్ లక్ష్యం. ఒక్క సినిమా అని కాకుండా అందరి ప్రాజెక్ట్స్ కలెక్షన్ల వర్షం కురిపించాలని తెలుగు ప్రేక్షకులను కోరుకుంటున్నారు మన హీరోలు. అలా ఇప్పుడు ఒక్కమాట మీద నిలబడుతోంది టాలీవుడ్. సినిమా గెలవాలన్నదే అందరి హీరోల మాట. ఇన్నాళ్ళూ లేదని కాదు.. అప్పుడప్పుడు ఒకరికి ఒకరు గతంలో కూడా సపోర్ట్ గా నిల్చునే వారు. అయినా సరే సపరేషన్ స్పష్టంగా కనిపించేది. అయితే ఇప్పుడలా కాదు బిగ్ స్టార్స్.. చిన్న సినిమాల స్టాండ్ తీసుకుంటున్నారు. పెద్ద సినిమాల కోసం కూడా వెనకాడకుండా ప్రమోషన్స్ చేసేస్తున్నారు. అసలెప్పుడు కనిపించని బాలయ్య – బన్నీ స్టేజ్ కాంబినేషన్ ఇలానే రీసెంట్ గా సెట్టయింది.

Top 5 Awaited Films: టాలీవుడ్ టూ బాలీవుడ్.. టాప్ 5 మోస్ట్ అవైటైడ్ మూవీస్ ఇవే!

అల్లు అర్జున్ అన్నట్టు సినిమా గెలావన్నదే అందరి తాపత్రయం. మా కలెక్షన్లే కుమ్మేయాలనే పార్షియాలిటీ చూపించకుండా.. చిన్నా, పెద్ద తేడా లేకుండా పెట్టుబడి పెట్టిన ప్రతిఒక్కరూ సక్సెస్ సాధించాలన్నది టాలీవుడ్ కోరిక. కరోనా తర్వాత పరిస్థితులు ప్రతిఒక్కరినీ మార్చేసాయి. ఎందుకంటే ఒక దశలో సినిమా ఫ్యూచర్ ఏంటన్న బెంగ అందరినీ వెంటాడింది. రిలీజ్ చేయాలంటే భయం, థియేటర్స్ కి జనం వస్తారా అన్న సందేహాలు స్టార్స్ అందర్ని కలవరపెట్టాయి. అయితే అన్నింటిని దాటి హై బడ్జెట్ సినిమాలకు వరుసగా సైన్ చేస్తూ టాలీవుడ్ హీరోలు ట్రెండ్ క్రియేట్ చేస్తున్నారు.

Star Duel Characters: డ్యూయెల్ షేడ్స్.. ఒకే సినిమాలో డబుల్ బొనాంజా!

బాలయ్య కూడా అదే మాట అన్నారు. తన సినిమాతో పాటు బన్నీ పుష్ప మూవీ ఇంకా చిరంజీవి ఆచార్య, ఎన్టీయార్ రామ్ చరణ్ నటించిన ట్రిపుల్ ఆర్, భీమ్లా నాయక్ ఇలా అన్ని సినిమాలు సూపర్ హిట్ కావాలని కోరుకున్నారు. దిగ్గజ దర్శకుడు రాజమౌళి కూడా సినిమా గెలవాలి అంతే అంటూ చెప్పడం బట్టి చూస్తూంటే టాలీవుడ్ అంతా ఒక్కటైంది అని అనిపించకమానదు.

Ketika Sharma: కుర్రకారు మతులు పోగొడుతున్న కేతిక!

టాలీవుడ్ ఇబ్బంది పడుతూంటే ఏపీ సర్కార్ బెనిఫిట్ షోలను రద్దు చేయడం టికెట్ల రేట్లను అలాగే ఉంచడం వంటి ఆంక్షల వల్ల కూడా తెలుగు ఇండస్ట్రీ మధనపడుతోంది. ఈ విషయంలో కూడా వారూ వీరూ తేడా లేకుండా స్పందిస్తున్నారు. చిరంజీవి ట్విట్టర్ ద్వారా జగన్ సర్కార్ కి అప్పీల్ చేసుకుంటే అఖండ వేదిక మీద బాలయ్య రెండు రాష్ట్ర ప్రభుత్వాలు టాలీవుడ్ కి సహకరించాలని కోరుకున్నారు. ఇదే మాటను మిగిలిన పెద్దలూ చెబుతున్నారు.

AP Floods: శభాష్ తారక్.. వరద బాధితులకు సినీ హీరోల సాయం!

ఇప్పుడంతా టాలీవుడ్ లో ఫ్రెండ్లీ కల్చర్ చూస్తున్నారు. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్.. స్మాల్, బిగ్ అన్న తేడా చూపించకుండా ప్రమోషన్స్ చేసి పేడుతున్నారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు ముందుకొస్తున్నారు. రామ్ చరణ్ సైతం సపోర్ట్ చేసేందుకు రెడీ అంటున్నారు. మహేశ్ బాబుతో పాటూ దాదాపు అందరూ పెద్ద స్టార్స్.. నేరుగా కాకపోయినా తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా సపోర్ట్ అందిస్తూనే ఉన్నారు.