Top 5 Awaited Films: టాలీవుడ్ టూ బాలీవుడ్.. టాప్ 5 మోస్ట్ అవైటైడ్ మూవీస్ ఇవే!

ఆడియెన్స్ ఎక్కువగా ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఏ సినిమాను ముందు థియేటర్స్ లో చూద్దామనుకుంటున్నారు.. ఇలాంటి క్వశ్వన్స్ కి టాప్ 5 ఆన్సర్స్ దొరికాయి..

Top 5 Awaited Films: టాలీవుడ్ టూ బాలీవుడ్.. టాప్ 5 మోస్ట్ అవైటైడ్ మూవీస్ ఇవే!

Top 5 Awaited Films

Top 5 Awaited Films: ఆడియెన్స్ ఎక్కువగా ఏ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.. ఏ సినిమాను ముందు థియేటర్స్ లో చూద్దామనుకుంటున్నారు.. ఇలాంటి క్వశ్వన్స్ కి టాప్ 5 ఆన్సర్స్ దొరికాయి.. టాలీవుడ్ టు హాలీవుడ్ ఐదు సినిమాలు టాప్ 5 మోస్ట్ అవైటైడ్ మూవీస్ గా నిలుస్తున్నాయి. తెలుగు ఆడియెన్స్ ఎప్పుడెప్పుడా అని ఫుల్ గా వెయిట్ చేస్తోన్న సినిమా ట్రిపుల్ ఆర్. అవును అందరి అంచనాలకు తగ్గట్టు ట్రిపుల్ ఆర్ మూవీ తెలుగు మోస్ట్ అవైటైడ్ మూవీస్ లిస్ట్ లో టాప్ 1 పొజిషన్ లో ఉంది. ఆ తర్వాతి ప్లేస్ లో పుష్పరాజ్ ఉన్నాడు. బన్నీ తర్వాత ధర్డ్ సీట్ లో డార్లింగ్ రాధేశ్యామ్ కూర్చున్నాడు. ఈ మూడు సినిమాలు కూడా భారీస్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజవడం టాప్ లో ఉండటానికి రీజన్. ట్రిపుల్ ఆర్, పుష్ప, రాధేశ్యామ్ తర్వాత టాలీవుడ్ ఆడియెన్స్ ఎదురుచూస్తోంది భీమ్లా నాయక్, సర్కారు వారి పాట సినిమాల గురించి.

Star Duel Characters: డ్యూయెల్ షేడ్స్.. ఒకే సినిమాలో డబుల్ బొనాంజా!

ఆడియెన్స్ ఎదురు చూపులకు తగ్గట్టే రిలీజ్ డేట్స్ కూడా సెట్టయ్యాయి. కాకపోతే ఫస్ట్ పొజిషన్ లో ఉన్న ట్రిపుల్ ఆర్ జనవరి 7న రిలీజ్ కాబోతుండగా.. సెకండ్ ప్లేస్ లో ఉన్న పుష్ప డిసెంబర్ 17న ముందుగా థియేటర్స్ కి వచ్చేస్తోంది. టాప్ 3 మూవీ రాధేశ్యామ్ జనవరి 14న లాక్ చేసుకోగా.. పవర్ స్టార్ భీమ్లానాయక్ జనవరి 12న రెండు రోజుల ముందే బరిలోకి దిగుతుంది. ఇక టాప్ 5 మూవీ సర్కారు వారి ఏప్రిల్ 1న రాబోతుంది. ఈలోపు మోస్ట్ అవైటైడ్ లిస్ట్ కూడా మారిపోతుంది.

Ketika Sharma: కుర్రకారు మతులు పోగొడుతున్న కేతిక!

తమిళ్ ప్రేక్షకులు కూడా కొన్ని సినిమాల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అందులో ఫస్ట్ ప్లేస్ లో ఉంది అజిత్ వలిమై. బోనీకపూర్ నిర్మాణంలో వినోద్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా ఇది. అజిత్ తర్వాతి పొజిషన్ లో విజయ్ ఉన్నాడు. ఆయన సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోన్న బీస్ట్ మూవీ టాప్ 2లో ఉంది. వలిమై, బీస్ట్ సినిమాల తర్వాత వరుసగా పొన్నియిన్ సెల్వన్, విక్రమ్, ధృవ నక్షత్రం ప్రాజెక్ట్స్ ఉన్నాయి. పొన్నియిన్ సెల్వన్ హిస్టారికల్ డ్రామాను మణిరత్నం ప్రజెంట్ చేస్తుండగా.. విక్రమ్ మూవీలో కమల్ హాసన్ తో పాటూ విజయ్ సేతుపతి, ఫహాద్ ఫాజిల్ నటిస్తున్నారు. ధృవ నక్షత్రం విక్రమ్ హీరోగా రాబోతుంది. ఏదేమైనా టాప్ పొజిషన్ లో ఉన్న వలిమై మాత్రం సంక్రాంతికి గట్టిగానే హిట్ కొట్టేలా ఉంది.

AP Floods: శభాష్ తారక్.. వరద బాధితులకు సినీ హీరోల సాయం!

బాలీవుడ్ టాప్ 5 లిస్ట్ లో నంబర్ 1 స్థానాన్ని సౌత్ సినిమా ఆక్రమించడం విశేషం. కేజీఎఫ్ 2 హిందీ వర్షన్ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు ఓ రేంజ్ లో ఎదురుచూస్తున్నారు. ఆ తర్వాత రణ్ బీర్, ఆలియా, అమితాబ్ తో సౌత్ టు నార్త్ స్టార్స్ నటించిన బ్రహ్మాస్త్ర సెకండ్ ప్లేస్ లో ఉంది. బ్రహ్మాస్త్ర సినిమా మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బ్రహ్మాస్త్ర తర్వాత ప్లేస్ లో మోస్ట్ అవైటైడ్ మూవీగా 83 నిలిచింది. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ట్రైలర్ ట్రెండ్ క్రియేట్ చేస్తోంది. 83 తర్వాత ట్రిపుల్ ఆర్ హిందీ వర్షన్.. ఆమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్ధా నాలుగైదు స్థానాల్లో ఉన్నాయి.

Ticket Price: సినిమా టికెట్ల పెంపుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

ఇండియన్ ప్రేక్షకులు ఎదురుచూస్తోన్న టాప్ 5 హాలీవుడ్ మూవీస్ లిస్ట్ కూడా రీసెంట్ గా రిలీజైంది. అందులో తొలి స్థానాన్ని మిషన్ ఇంపాజిబుల్ 7 దక్కించుకుంది. ఆ తర్వాత అవతార్ 2, థోర్ – లవ్ అండ్ థండర్, జురాసిక్ వరల్డ్ – డొమినియన్, ది బ్యాట్ మ్యాన్ సినిమాలున్నాయి.