Ticket Price: సినిమా టికెట్ల పెంపుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

కొత్త సినిమాల టికెట్ ధరలపై తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు శుభం కార్డు పడింది. టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్ల యాజమాన్యాలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఇంతకు ముందు థియేటర్ల..

Ticket Price: సినిమా టికెట్ల పెంపుకు తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్

Ticket Price: కొత్త సినిమాల టికెట్ ధరలపై తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు శుభం కార్డు పడింది. టికెట్ల ధరలు పెంచేందుకు థియేటర్ల యాజమాన్యాలకు హైకోర్టు అనుమతిచ్చింది. ఇంతకు ముందు థియేటర్ల యాజమాన్యాలు టికెట్ల ధరల పెంపునకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా.. ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం పెంపుకి అనుమతినిచ్చింది.

AP Floods: శభాష్ తారక్.. వరద బాధితులకు సినీ హీరోల సాయం!

త్వరలో విడుదల కానున్న కొత్త సినిమాలు అఖండ, రాధేశ్యామ్, ఆర్‌ఆర్‌ఆర్‌, పుష్ప తదితర భారీ బడ్జెట్‌ సినిమాలకు ధరలు పెంచుతామని థియేటర్ యాజమాన్యాలు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరాయి. ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతివ్వాలని కేసీఆర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాయి. అయితే, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో థియేటర్ యాజమాన్యాలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించి ధరల పెంపు కోసం పిటిషన్ దాఖలు చేశాయి.

83 Film: సమ్ థింగ్ స్పెషల్ ’83’.. ఫస్ట్ వరల్డ్ కప్ నాటి ఉత్కంఠ!

థియేటర్ల యాజమాన్యాలు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ధర్మాసనం.. ఒక్కో టికెట్‌పై రూ.50 పెంచేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాబోయే భారీ బడ్జెట్ కొత్త సినిమాల టికెట్ల ధరలు భారీగా పెరగనున్నాయి. మరోవైపు ఏపీలో కూడా టికెట్ల ధరల విషయంలో ఇదే తరహా ప్రతిష్టంభన నెలకొని ఉన్న సంగతి తెలిసిందే కాగా.. మరి అక్కడ థియేటర్ యాజమాన్యాలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ఆసక్తిగా మారింది.