Star Duel Characters: డ్యూయెల్ షేడ్స్.. ఒకే సినిమాలో డబుల్ బొనాంజా!

స్టార్స్ ఇప్పుడు కొత్త షేడ్స్ చూపిస్తున్నారు. మంచి క్యారెక్టర్స్ పడాలే కానీ ఒకే సినిమాలో డబుల్ బొనాంజా సృష్టిస్తున్నారు. డబుల్ యాక్షన్ తో.. డబుల్ షేడ్స్ తో మెస్మరైజ్ చేసేస్తున్నారు

Star Duel Characters: డ్యూయెల్ షేడ్స్.. ఒకే సినిమాలో డబుల్ బొనాంజా!

Star Duel Characters

Star Duel Characters: స్టార్స్ ఇప్పుడు కొత్త షేడ్స్ చూపిస్తున్నారు. మంచి క్యారెక్టర్స్ పడాలే కానీ ఒకే సినిమాలో డబుల్ బొనాంజా సృష్టిస్తున్నారు. డబుల్ యాక్షన్ తో.. డబుల్ షేడ్స్ తో మెస్మరైజ్ చేసేస్తున్నారు. ఛాన్స్ దొరికితే ఒకే సినిమాలో డబుల్ షేడ్స్ చూపించేస్తున్నారు మన హాట్ స్టార్స్. ఖిలాడీ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. రవితేజకు డబుల్ యాక్షన్ చేయడం కొత్తేం కాదు. విక్రమార్కుడు, డిస్కోరాజా లాంటి సినిమాల్లో మాస్ రాజా రెండు రోల్స్ చేసేసాడు. అయితే ఇప్పుడు ఖిలాడి సినిమాలో నెవర్ బిఫోర్ రేంజ్ లో రెండు క్యారెక్టర్స్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.

Ketika Sharma: కుర్రకారు మతులు పోగొడుతున్న కేతిక!

అలాగే సుధీర్ వర్మ డైరెక్షన్లో ప్రకటించిన రావాణాసుర మూవీలో లాయర్ గా కనిపించబోతున్న మాస్ రాజా.. ఆ క్యారెక్టర్ తో ఏకంగా పది షేడ్స్ లో ఎక్స్ ప్లోర్ అవబోతున్నారు. రావణాసురి పది తలలు, పది రకాల ఆలోచనలకు తగ్గట్టు రవితేజ విజృంభించబోతున్నాడు. బింబిసార సినిమాలో నందమూరి కల్యాణ్ రామ్ రెండు క్యారెక్టర్స్ లో యాక్ట్ చేసాడు. రీసెంట్ గా రిలీజైన టీజర్ చూస్తుంటే సినిమాలో బాగానే విషయం ఉన్నట్టు కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా కల్యాణ్ రామ్ క్యారెక్టర్స్ ఆడియెన్స్ కి థ్రిల్ ఇచ్చేలా అనిపిస్తోంది. పీరియాడికల్ ఎలిమెంట్స్, లేటెస్ట్ కల్చర్ మిక్స్ చేస్తూ టైమ్ ట్రావెల్ మూవీగా బింబిసార తెరకెక్కింది. ఇందులో త్రిగర్తల రాజ్యాధిపతి బింబిసారగా, ఈతరం కుర్రాడిగా రెండు సూపర్ రోల్స్ లో నటించాడు కల్యాణ్ రామ్. ఫస్ట్ లుక్ ప్లస్ టీజర్ తో పాజిటివ్ వైబ్స్ వచ్చేలా బింబిసారపై కేర్ తీసుకున్నాడు డైరెక్టర్ మల్లిది వశిష్ట్.

AP Floods: శభాష్ తారక్.. వరద బాధితులకు సినీ హీరోల సాయం!

శ్యామ్ సింగ రాయ్ కూడా పీరియాడికల్ డ్రామాగానే రాబోతుంది. 1970 కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ రవ్ అవుతాయి. గతంలో అన్యాయాన్ని ఎదిరించే రాయల్ లుక్ లో నానిని ప్రెజెంట్ చేసిన డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్.. క్లాసీ లుక్ లో ప్రజెంట్ జనరేషన్ కి తగ్గట్టు నానిని మరో రోల్ లో చూపించాడు. ఫ్లాష్ బ్యాక్ లో నానికి జోడీగా సాయిపల్లవి నటిస్తుంటే.. కృతిశెట్టి ట్రెండీ గర్ల్ గా పలకరించబోతుంది. ఇక నాని కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగా రాబోతుంది శ్యామ్ సింగ రాయ్. డిసెంబర్ 24న రిలీజ్ కాబోతున్న ఈ మూవీ కోసం నాని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

83 Film: సమ్ థింగ్ స్పెషల్ ’83’.. ఫస్ట్ వరల్డ్ కప్ నాటి ఉత్కంఠ!

అఖండ మూవీలో బాలయ్యదీ డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టరే. శ్రీనివాస్ అనే క్యారెక్టర్ తో పాటూ అఖండగా అలరించబోతున్నారు. అఘోరగా మారే శ్రీనివాస్ గా కనిపిస్తారా.. శ్రీనివాస్, అఖండ వేరు వేరు పాత్రలా అన్నది మాత్రం సినిమా రిలీజయ్యాకే తెలుస్తుంది. బాలకృష్ణ కెరీర్ లో ఎప్పుడూ చేయని అఘోర పాత్రలో గర్జిస్తుంటే.. ఆయన ఫ్యాన్స్ పూనకాలు తెచ్చుకుంటున్నారు. థియేటర్స్ దద్దరిల్లేలా చేసేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే టీజర్స్, ట్రైలర్స్, లిరికల్ సాంగ్స్ కి ఓ రేంజ్ లో రెస్పాన్స్ దక్కింది. ఇక బోయపాటి రెండు షేడ్స్ లో బాలయ్యను నెవర్ బిఫోర్ రేంజ్ లో చూపించారనే టాక్ ఉంది.

Dipali Sharma: తెలుగు తెరకు మరో కొత్త అందం.. ఫోటోలు!

సలార్ సినిమాలో కూడా ప్రభాస్ ది డ్యూయల్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ అన్న టాక్ నడుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో డార్లింగ్ మాస్ లుక్స్ సినిమాకే హైలైట్ అనే ప్రచారం జరుగుతోంది. ఇక హరిహర వీరమల్లులో వజ్రాల దొంగగా కనిపిస్తూనే.. సాఫ్ట్ అండ్ మాస్ లుక్స్ లో డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నారు పవన్ కల్యాణ్. డబుల్ రోల్ కాదు కానీ ఆచార్య సినిమాలో చిరూ, చరణ్ లు టూ షేడ్స్ ఒకే క్యారెక్టర్ లో చూపించబోతున్నారు. అడవిలో అన్నలుగా నక్సలైట్ లుక్స్ లో అదరగొట్టే తండ్రీకొడుకులు.. ధర్మస్థలిలో సోషల్ రీఫార్మర్స్ గా న్యాయపోరాటం చేస్తారనే టాక్ ఉంది.

Lakshya: తప్పించి గెలవాలా? తప్పుడు దారిలో గెలవాలా?

మణిరత్నం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా పొన్నియిన్ సెల్వన్. రెండు భాగాలుగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఐశ్వర్య రాయ్, విక్రమ్, కార్తీ, త్రిషా, జయం రవి, ఐశ్యర్య లక్ష్మీ, ప్రకాశ్ రాజ్, శోభిత ధూళిపాల.. ఇలా భారీ కాస్ట్ తో సెట్స్ పై ఉంది ఈ సినిమా. అయితే ఇందులో ఐశ్యర్య రాయ్ రెండు పాత్రల్లో నటిస్తోంది. రాణి నందిని, మందాకిని అనే క్యారెక్టర్స్ లో ఫ్యాన్స్ కు డబుల్ బొనాంజ ఇవ్వనుంది ఐశ్వర్యా రాయ్. గతంలో మణిరత్నం, ఐశ్వర్య కాంబోలో ఇద్దరు, గురు, రావణ్ సినిమాలొచ్చాయి. ఇద్దరికీ మంచి ర్యాపో ఉన్న కారణంగా ఐశ్వర్య కోసమే స్పెషల్ గా పొన్నియన్ సెల్వన్ రెండు రోల్స్ ను డిజైన్ చేసారు మణిరత్నం.