Gwalior Central jail : పిల్లల్ని కనేందుకు జైల్లో ఉన్న నా భర్తను విడుదల చేయండి : భార్య విన్నపం .. అధికారులేమన్నారంటే

భర్త జైల్లో ఉన్నాడు. భార్య బయటే ఉంది. కానీ ఆమె పిల్లల్ని కనాలనుకుంటోంది. దానికోసం జైల్లో ఉన్న భర్తను విడుదల చేయాలని కోరుతు జైలు అధికారులను విన్నవించుకుంది ఓ యువతి.

Gwalior Central jail : పిల్లల్ని కనేందుకు జైల్లో ఉన్న నా భర్తను విడుదల చేయండి : భార్య విన్నపం .. అధికారులేమన్నారంటే

Gwalior women to have a kid

Gwalior women to have a kid : భర్త జైల్లో ఉన్నాడు. భార్య బయటే ఉంది. కానీ ఆమె పిల్లల్ని కనాలనుకుంటోంది. దానికోసం జైల్లో ఉన్న భర్తను విడుదల చేయాలని కోరుతు జైలు అధికారులను విన్నవించుకుంది ఓ యువతి. ఆమె వినతి పత్రాన్ని పరిశీలించిన అధికారులు ఉన్నతాధికారులకు పంపిస్తామని వారి ఆదేశాల మేరకు విడుదల చేయాలా? వద్దా? అనేది ఉంటుందని తెలిపారు.

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సెంట్రల్ జైల్లో దారా సింగ్ జాతవ్‌ అనే యువకుడు ఓ హత్యకేసులో గత ఏడేళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. శివపురికి చెందిన దారాసింగ్ కు వివాహం వెంటనే పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్య కేసు విచారణలో తారా సింగ్ దోషిగా నిర్ధారణ కావటంతో గ్వాలియర్ సెంట్రల్ జైలుకు తరలించగా ఏడేళ్లుగా అదే జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఈ క్రమంలో పిల్లల్ని కనేందుకు భర్తను విడుదల చేయాలని దారా సింగ్ భార్య జైలు అధికారులను కోరింది. ఎందుకంటే దారా సింగ్‌ తల్లిదండ్రులు వృద్ధులు. కుమారుడి పెళ్లి వేడుకలు పూర్తి కాకముందే పోలీసులు అరెస్ట్‌ చేశారని..దీంతో తన కోడలికి పిల్లలు పుట్టలేదని తనకు మనుమలను చూడాలని ఉందని దారాసింగ్ తండ్రి కరీం సింగ్‌ జాతవ్‌ వాపోయాడు.

తన భార్య అనారోగ్యంతో ఉన్నదని..వృద్ధాప్యంలో ఉన్నతాము చనిపోయేలోగా మనుమలను చూడాలని ఆశగా ఉందని తెలిపారు. మా కోరిక తీరాలంటే నాకోడలు గర్భవతి కావాలి దాని కోసం నా కుమారుడ్ని కొంతకాలం జైలు నుంచి విడుదల చేయాలని ప్రాథేయపడ్డాడు. దీంట్లో భాగంగా కోడలితో దారా సింగ్‌ పెరోల్‌ కోసం గ్వాలియర్ సెంట్రల్ జైలును ఆశ్రయించాడు. సంతానం కోసం తన భర్తను విడుదల చేయాలని..తమ అవసాన దశలో ఉన్న తమ అత్తమామల కోరిక తీర్చటం కోడలిగా నా బాధ్యత దయచేసిన నా భర్తను విడుదల చేయండీ అని జైలు అధికారులను వినతిపత్రం ద్వారా కోరింది.

ఆమె వినతిని పరిశీలించిన శివపురి ఎస్పీ పరిశీలనకు పంపినట్లు గ్వాలియర్ సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ విదిత్ సిరవయ్య తెలిపారు. ఇతర ఖైదీలు, జైలు అధికారులతో మంచి ప్రవర్తన కలిగి ఉంటే రెండేళ్లు జైలు శిక్ష పూర్తైన ఖైదీలు పెరోల్‌కు అర్హులని తెలిపారు. కానీ ఖైదీకి పెరోల్ మంజూరు చేయాలా? వద్దా? అనేది జిల్లా కలెక్టర్‌దే చివరి నిర్ణయమని తెలిపారు.