Agnipath protests: ఆందోళనల ఎఫెక్ట్.. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వం

హర్యానా రాష్ట్రంలోనూ అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా యువత నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది. శనివారం సాయంత్రం 4.30 గంటల వరకు నిలిపివేత కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Agnipath protests: ఆందోళనల ఎఫెక్ట్.. ఇంటర్నెట్ సేవలను నిలిపివేసిన ప్రభుత్వం

Haryana Govt

Agnipath protests: కేంద్ర ప్రభుత్వం ఆర్మీలో రిక్రూట్ మెంట్ ల కోసం తీసుకొచ్చిన ‘అగ్నిపథ్’ పథకంకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. బీహార్ లో ఆందోళన కారులు రైళ్లకు నిప్పంటించారు. శుక్రవారం తెలంగాణలోని సికింద్రాబాద్ లో ఆందోళనకారులు రైల్వే స్టేషన్ లోకి వెళ్లి రైళ్లకు నిప్పంటించారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళన కారులకు మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోలీసుల పైకి ఆందోళన కారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతిచెందగా, మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి.

Agnipath: ‘అగ్నిపథ్’ పథకంలో తొలి అడుగు.. జూన్ 24నుంచి ఎయిర్‌ఫోర్స్‌లో నియామకాల ప్రక్రియ షురూ..

అదేవిధంగా హర్యానా రాష్ట్రంలోనూ అగ్నిపథ్ పథకంకు వ్యతిరేకంగా యువత నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసింది. శనివారం సాయంత్రం 4.30 గంటల వరకు నిలిపివేత కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Cows Dead: షాకింగ్ వీడియో.. ఒకేచోట వేలాది ఆవుల మృతదేహాలు.. కారణమేమిటంటే..

కొత్త ఆర్మీ రిక్రూట్‌మెంట్ పాలసీ కారణంగా ఏర్పడే శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, ఉద్రిక్తత, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా, ఆస్తి నష్టం, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం మొబైల్ ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలను నిలిపివేసినట్లు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇంటర్నెట్ కారణంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.