Hyderabad : నగరంలో దంచికొట్టిన వాన

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు మెరులతో వర్షం దంచికొట్టింది.

Hyderabad : నగరంలో దంచికొట్టిన వాన

Heavy rain

Hyderabad : హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. శనివారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. ఉరుములు మెరులతో వర్షం దంచికొట్టింది. వారం రోజుల తర్వాత నగరంలో భారీ వర్షం కురిసింది. ఇక వర్షం దాటికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరింది. బంజారాహిల్స్‌, ఖైర‌తాబాద్, జూబ్లీహిల్స్, కొండాపూర్, హైటెక్‌సిటీ, సోమాజిగూడ‌, బేగంపేట‌, సికింద్రాబాద్, తార్నాక‌, ఉప్ప‌ల్, ఎల్బీన‌గ‌ర్‌, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, హయ‌త్‌న‌గ‌ర్‌, సంతోష్‌న‌గ‌ర్‌, చాద‌ర్‌ఘాట్‌, కోఠి, అఫ్జ‌ల్ గంజ్, జియ‌గూడ‌, లంగ‌ర్‌హౌజ్, ల‌క్డీకాపూల్, మెహిదీప‌ట్నం, టోలిచౌకీతో పాటు ప‌లు ప్రాంతాల్లో వ‌ర్షం కురిసింది. ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది. టోలిచౌకి ప్రాంతంలో
వర్షపు నీరు రోడ్లపై నిలిచింది.

చదవండి : Rains : తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు