Rains : తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Rains : తెలంగాణలో రెండు రోజులపాటు భారీ వర్షాలు

Heavy rains in Telangana : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో విస్తారంగా వానలు పడుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ , విజిలెన్స్‌ , డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ పరిస్థితులను బట్టి పౌరులు… తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నారు.

తెలంగాణలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కుండపోత వానలు పడుతున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల పిడుగులు పడడంతో ప్రజలు బెంబేలెత్తారు. శనివారం రాష్ట్రంలో పిడుగుపాట్లకు ఐదుగురు మృతి చెందారు. ఒక్క ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో నలుగురు, హనుమకొండ జిల్లాలో ఒకరు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పలుచోట్ల పిడుగులుపడి పశువులు మృతి చెందాయి. మరోవైపు, ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో భారీ వర్షం పడింది.

Heavy Rain : హైదరాబాద్‌ లో భారీ వర్షం… 23 సె.మీవర్షపాతం నమోదు

ఉత్తర అండమాన్‌ సముద్రంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రాగల 28గంటల్లో అల్పపీడనం ఏర్పడి, తర్వాత నాలుగైదు రోజుల్లో మరింత బలపడి.. దక్షిణ ఒడిసా-ఉత్తరకోస్తాంధ్ర తీరాల వైపు ప్రయాణించే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 2రోజులు రాయలసీమలో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, కోస్తా జిల్లాల్లో అనేకచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

నిన్న హైదరాబాద్‌ లో కుండపోత వర్షం కురిసింది. నిన్న ఏకధాటిగా కురిసిన వర్షానికి నగరం ఆగమాగం అయ్యింది. భారీ వర్షానికి రోడ్లన్నీ చెరువులను తలపించాయి. దీంతో జనం ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. పలు ప్రాంతాల్లో సాయంత్రం నుంచే విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. చాలా కాలనీలు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. వరదతో చెరువులు, నాలాలు ఉప్పొంగాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. పలు కాలనీలు నీట మునిగాయి. రోడ్లపై భారీగా నీరు చేరడంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్‌ స్తంభించిపోయింది.