Kerala Rains : కేరళను ముంచెత్తిన వర్షాలు….ఈరోజు, రేపు శబరిమల దర్శనాలు రద్దు

కేరళ వద్ద ఆగ్నేయ ఆరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి.

Kerala Rains : కేరళను ముంచెత్తిన వర్షాలు….ఈరోజు, రేపు శబరిమల దర్శనాలు రద్దు

Kerala Rains Floods

Kerala Rains : కేరళ వద్ద ఆగ్నేయ ఆరేబియా సముద్రతీరాన ఏర్పడిన అల్పపీడనం కారణంగా కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పథనంతిట్ట, కొట్టాయంలతో పాటు ఎర్నాకుళం, ఇడుక్కి, త్రిశూర్, పాలక్కాడ్ జిల్లాలు వర్షం భీభత్సంతో అల్లాడిపోయాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహాదారులు నీటమునిగాయి. వాగులు వంకలు ప్రమాదకర స్ధాయిలో పొంగిపొర్లుతున్నాయి. జలాశయాల్లో నీటి మట్టాలు గరిష్టస్ధాయికి చేరుకుంటున్నాయి.

Kerala Floods And Rains

Kerala Floods And Rains

కొండప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి.భారీ వర్షాలకారణంగా రాష్ట్రంలో ఇంతవరకు 6గురు మరణించగా 15 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. తాజా పరిస్ధితిని గమనించిన ప్రభుత్వంఎన్డీఆర్ఎఫ్ బృందాలు, త్రివిధదళాలకు చెందిన సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టింది. పథనంతిట్ట, కొట్టాయంతో సహా 6 జిల్లాలల్లో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Also Read : Shirdi Saibaba Temple : షిర్డికి ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన టూరిజం శాఖ

తిరువనంతపురం కొల్లాం.అలప్పుజ, మలప్పురం,కోజికోడ్, వయనాడ్ జిల్లాలకు ఆరెంజ్ ఎలర్ట ప్రకటించారు.రాష్ట్రంలో ఈరోజు వరకు అథి భారీ వర్షాలు రేపు ఉదయం వరకు భారీ వర్షాలు, మంగళవారం సాధారణ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా పరిస్ధితి సీరియస్ గా ఉందని….24 గంటలు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ హెచ్చరించారు.

Kerala Heavy Rains Floods

Kerala Heavy Rains Floods

భారీ వర్షాల కారణంగా నిన్న తెరిచిన శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలో దర్శనాలను ఈరోజు రేపు తాత్కాలికంగా నిలిపివేశారు. శబరిమలకొండకు వచ్చే మార్గాల్లో కొండచరియలు విరిగి పడటంతో భక్తులు శబరిమలకు రావద్దని ట్రావెన్ కోర్ దేవస్ధానం బోర్డు భక్తులకు విజ్ఞప్తి చేసింది. ఎరుమేలి శ్రీధర్మశాస్తా ఆలయ ప్రాంగణం వద్ద కులిక్కడావు పొంగి ప్రవహిస్తోంది.