Kedarnath : అదుపు తప్పిన హెలికాప్టర్- తృటిలో తప్పిన ప్రమాదం

ఒక హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

Kedarnath : అదుపు తప్పిన హెలికాప్టర్- తృటిలో తప్పిన ప్రమాదం

Uttarakhand

Kedarnath :  ఒక హెలికాప్టర్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చార్‌థామ్‌కు యాత్రికులను తీసుకు వెళుతున్న థంబీ ఏవియేషన్ కు చెందిన బెల్ 407 హెలికాప్టర్ కేదార్‌నాథ్ లో ల్యాండింగ్ అవుతుండగా అదుపు తప్పింది. దీంతో హెలికాప్టర్ లోని ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

అయితే పైలట్ చాకచక్యంగా వ్యవహరించి పరిస్ధితిని కొద్దిక్షణాల్లోనే అదుపులోకి తీసుకు రావటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మే31 వ తేదీ మధ్యాహ్నం గం.1-30 కి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  ఈ  ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారుల స్పందించారు.

ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని… ఎన్ఓసీ, భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ప్రైవేట్ హెలికాప్టర్ ఆపరేటర్లకు ఆదేశాలిచ్చామని తెలిపారు. ప్రయాణికుల భద్రతకోసం ఆకస్మిక తనిఖీలు కూడా చేయాలని  నిర్ణయించినట్లు డీజీసీఏ తెలిపింది. వాతావరణం అనుకూలించకపోతే వెనక్కి  తిరిగి రావాలని డీజీసీఏ సూచించింది. గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ కారణంగా చార్ థామ్ యాత్ర నిలిపినవేయబడింది. ఈ ఏడాది అనుమతి ఇచ్చే సరికి యాత్రికుల రద్దీ ఎక్కువయ్యింది.